Dil Raju , Ram Charan
Dil Raju and Ram Charan : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘గేమ్ చేంజర్’ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ అంచనాల నడుమ విడుదలై ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చిన సంగతి తెలిసిందే. సాధారణంగా తన సినిమాలకు భారీ బడ్జెట్స్ పెట్టకుండా, చాలా మీడియం బడ్జెట్ లో సినిమాలు తీసే నిర్మాత దిల్ రాజు , ఈ చిత్రానికి దాదాపుగా 400 కోట్ల రూపాయిలు ఖర్చు చేశాడు. కేవలం పాటల కోసమే ఆయన 80 కోట్ల రూపాయిలు ఖర్చు చేశాడట. తన కెరీర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ చిత్రాన్ని తన 50వ చిత్రంగా ప్రమోట్ చేసుకుంటూ విడుదల చేసాడు. బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు ఈ సినిమాకి 210 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కచ్చితంగా మరో 250 కోట్ల రూపాయిలు రాబట్టాలి. థియేట్రికల్ రన్ దాదాపుగా ముగింపుకి వచ్చేయడంతో అది అసాధ్యం అనే చెప్పాలి.
అయితే ఈ సినిమా ద్వారా దిల్ రాజు కి భారీ నష్టాలు రావడంతో, రామ్ చరణ్ మరో సినిమా ఆయనతో ఉచితంగా చేస్తానని మాట ఇచ్చినట్టు గత వారం రోజులుగా సోషల్ మీడియా లో ప్రచారం జరుగుతుంది. దీనిపై సపండించిన రామ్ చరణ్ టీం, అందులో ఎలాంటి వాస్తవం లేదంటూ స్పష్టం చేసింది. రామ్ చరణ్ ప్రస్తుతం తన దృష్టిని మొత్తం బుచ్చి బాబు సినిమా మీద, అదే విధంగా త్వరలో సుకుమార్ తో చేయబోతున్న సినిమా మీద పెట్టాడని, ఈ రెండు సినిమాల మీద తప్ప, ఆయన మరో సినిమాకి ప్రస్తుతం ఒప్పుకోలేదని, ఏదైనా ఉంటే అధికారికంగా చెప్తారని, అప్పటి వరకు నమ్మొద్దు అంటూ చెప్పుకొచ్చారు. దీంతో రూమర్స్ కి ఒక్కసారిగా చెక్ పడింది. రేపటి నుండి బుచ్చి తో చేస్తున్న సినిమాకి సంబంధించిన కొత్త షెడ్యూల్ హైదరాబాద్ లో మొదలు కానుంది.
ఈ షెడ్యూల్ లో రామ్ చరణ్ కూడా పాల్గొనబోతున్నాడు. ఈ చిత్రం లో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తుండగా, AR రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. షూటింగ్ కార్యక్రమాలు సాధ్యమైనంత తొందరగా పూర్తి చేసి, అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఈ చిత్రం తన కెరీర్ లో రంగస్థలం ని మించిన సినిమా అవుతుందని, క్యారక్టర్ అంత అద్భుతంగా వచ్చిందంటూ రామ్ చరణ్ ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. ఈ చిత్రానికి ‘పెద్ది’ అనే టైటిల్ పెడితే ఎలా ఉంటుంది అని పరిశీలిస్తున్నారు. గ్రామీణ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ కూడా నటిస్తాడని టాక్ వినిపిస్తుంది. ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో చూడాలి. ఈ చిత్రం లో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ రామ్ చరణ్ కి కోచ్ గా నటిస్తున్నాడు.