Double Smart
Double Smart : హీరో రామ్ కెరీర్ లో ఎప్పటికీ మర్చిపోలేని బ్లాక్ బస్టర్ ఏదైనా ఉందా అంటే అది పూరి జగన్నాథ్ దర్శకత్వం లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రమే. అప్పట్లో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి సుమారుగా 40 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. డైరెక్టర్ గా, నిర్మాతగా పూరి జగన్నాథ్ కి ఈ చిత్రం మంచి కం బ్యాక్ అనే చెప్పాలి. అప్పటి వరకు వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తో దివాలా తీసే స్థితిలో ఉన్న ఆయన్ని రక్షించింది ఈ చిత్రమే. అయితే ఈ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన ‘డబుల్ ఇస్మార్ట్’ మాత్రం ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. నిర్మాతకి, బయ్యర్స్ కి అత్యధిక నష్టాలు తెచ్చిపెట్టిన నెంబర్ 1 చిత్రం ఇదేనని ట్రేడ్ పండితులు చెప్తున్నారు.
థియేట్రికల్ పరంగా అంతటి ఘోరమైన డిజాస్టర్ గా నిల్చిన ఈ చిత్రాన్ని రీసెంట్ గానే హిందీ లోకి డబ్ చేసి RKD స్టూడియోస్ అనే యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేసారు. అప్లోడ్ చేసిన రెండు వారాల్లోనే ఈ సినిమాకి 100 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయి. ఇది ఆల్ టైం రికార్డుగా చెప్తున్నారు. తక్కువ సమయంలో ఈ స్థాయి వ్యూస్ రావడం ఈ సినిమాకే జరిగిందని, బాలీవుడ్ ఆడియన్స్ ఈ చిత్రాన్ని అమితంగా ఇష్టపడుతున్నారు అంటూ చెప్పుకొస్తున్నారు. కేవలం ఈ ఒక్క సినిమా మాత్రమే కాదు , రామ్ పోతినేని గత చిత్రాలు కూడా హిందీ లో డబ్ అయ్యి వందల కొద్దీ మిలియన్ల వ్యూస్ ని దక్కించుకున్నాయి. అప్పటి నుండి హిందీ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉన్నందున ఈ సినిమాకి కూడా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. 100 మిలియన్ వ్యూస్ అంటే 10 కోట్ల రూపాయలకు పైగానే డబ్బులు వచ్చి ఉంటాయని విశ్లేషకులు అంటున్నారు.
ఇక రామ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయానికి వస్తే, ‘మిస్ శెట్టి..మిస్టర్ పోలిశెట్టి’ చిత్రానికి దర్శకత్వం వహించిన మహేష్ బాబు తో ఆయన ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని విడుదల చేయగా దానికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఈ చిత్రం లో రామ్ సాగర్ అనే యువకుడి క్యారక్టర్ చేస్తున్నాడు. సినిమా టైటిల్ కూడా అదే ఫిక్స్ అయ్యేలా ఉంది. వరుసగా మాస్ సినిమాలు చేస్తూ ఫ్లాప్స్ ని అందుకుంటున్న రామ్, ఈసారి యూత్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ ఈ చిత్రంలో నటిస్తున్నాడు. రామ్ యూత్ సినిమాలు తీసినప్పుడల్లా మంచిగా సక్సెస్ అయ్యాడు. కానీ మాస్ సినిమాలే ఫ్లాప్ అవుతున్నాయి. తన స్ట్రాంగ్ జానర్ లోకి వచ్చేసాడు కాబట్టి ఈ సినిమాతో కచ్చితంగా పెద్ద హిట్ కొడతాడని ఆయన అభిమానులు బలంగా నమ్ముతున్నారు.