Photo Story
Photo Story: సినిమా ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టి స్టార్ హీరో, హీరోయిన్లుగా ఎదిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ ఫోటోలో ఉన్న హీరోయిన్ కూడా ఆ కోవకు చెందిందే. ఈమె తండ్రి సౌత్ సినిమా ఇండస్ట్రీలో దిగ్గజ నటుడు. ఈమె తల్లి కూడా ప్రముఖ నటి. దీంతో ఈ చిన్నదానికి సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ త్వరగానే లభించింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా తండ్రితో కలిసి నటించిన ఈ చిన్నారి ఆ తర్వాత హీరోయిన్ గా సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. సినిమాలలో హీరోయిన్ గా నటిస్తూనే పాటలు పాడుతూ సింగర్ గా కూడా తన సత్తా చాటింది. అయితే హీరోయిన్ గా అడుగుపెట్టిన ప్రారంభంలో ఈమెకు అదృష్టం కలిసి రాలేదు. మొదట్లో ఈమె చేసిన సినిమాలన్నీ పరాజయం పొందాయి.
దీంతో ఈ ముద్దుగుమ్మకు ఐరన్ లెగ్ అన్న పేరు కూడా వచ్చింది. ఇక ఆ తర్వాత ఎప్పుడైతే ఈ బ్యూటీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి నటించిన ఆమె జాతకమే మారిపోయింది. ఇప్పటికే మీకు ఈ హీరోయిన్ ఎవరో అర్థం అయిపోయి ఉంటుంది. ఆమె మరి ఎవరో కాదు పవన్ కళ్యాణ్ కు జోడిగా గబ్బర్ సింగ్ సినిమాలో హీరోయిన్ గా నటించిన శృతిహాసన్. గబ్బర్ సింగ్ సినిమా తర్వాత ఆమెకు తెలుగులో వరుసగా సినిమా అవకాశాలు క్యూ కట్టాయి. శృతిహాసన్ తన తండ్రి కమల్ హాసన్ నటించిన హే రామ్ అనే సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. 2000 సంవత్సరంలో ఈ సినిమా రిలీజ్ అయింది. ఇక ఆ తర్వాత ఈమె లక్ అనే హిందీ సినిమాతో తన కెరీర్ను ప్రారంభించింది. ఇక తెలుగులో హీరో సిద్దార్థ్ కు జోడిగా అనగనగా ఓ ధీరుడు అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత శృతిహాసన్ తెలుగుతో పాటు తమిళ్, హిందీలో కూడా అనేక సినిమాలలో నటించింది. ఇలా కెరియర్ మంచి ఫామ్ లో ఉన్న సమయంలో లవ్, డేటింగ్, రిలేషన్షిప్ అంటూ కాస్త గ్యాప్ తీసుకుంది. ఇక ఇటీవలే ఈ అమ్మడు రీఎంట్రీ తో ఫుల్ ఫామ్ లో దూసుకుపోతుంది.
శృతిహాసన్ సెకండ్ ఇన్నింగ్స్ లో చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. జనవరి 28 మంగళవారం రోజు శృతిహాసన్ పుట్టినరోజు సందర్భంగా ఆమె బంధువులు, కుటుంబ సభ్యులు, సినిమా సెలబ్రెటీలు, అభిమానులు శృతిహాసన్ కు పుట్టినరోజు విషెస్ తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే శృతిహాసన్ కు సంబంధించిన చిన్ననాటి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం శృతిహాసన్ వకీల్ సాబ్, క్రాక్, వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య, సలార్ పార్ట్ 1 ఇలా వరుస సినిమాలతో విజయం అందుకొని ఫుల్ జోష్ లో ఉంది.
ప్రస్తుతం ఈమె చేతిలో భారీ సినిమా ప్రాజెక్టులు ఉన్నాయి. శృతిహాసన్ లోకేష్ కనగరాజ్, హీరో రజినీకాంత్ కాంబినేషన్ లో వస్తున్న కూలి సినిమాలో కూడా నటిస్తుంది. అలాగే ఈ అమ్మడు విజయ్ సేతుపతి ట్రైన్ మూవీలో కూడా హీరోయిన్ గా నటించనుంది. అలాగే ప్రభాస్ సలార్ పార్ట్ 2 సినిమాలో కూడా ఈమెనే నటించాల్సి ఉంది. దీంతోపాటు ప్రస్తుతం శృతిహాసన్ చేతిలో మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులు ఉన్నట్లు సమాచారం.