Ram Charan: ‘ఆచార్య’ ఘోరపరాజయం అయినప్పటి నుంచి.. రామ్ చరణ్ తన కొత్త సినిమాల విషయంలో చాలా మార్పులు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే గౌతమ్ తిన్నునూరి కి షాక్ తగిలింది. సక్సెస్ ఫుల్ చిత్రాల దర్శకుడు కొరటాల తీసిన ‘ఆచార్య’ పెట్టుబడిలో కనీసం 50 శాతం రికవరీ సాధించలేకపోయింది. ఫస్ట్ షోకే డిజాస్టర్ టాక్ అందుకోగా… రెండో రోజే కలెక్షన్స్ పడిపోయాయి.

ఈ నేపథ్యంలో చరణ్ ఇప్పుడు తన డేట్స్ గౌతమ్ కి ఇవ్వాలా? వద్దా ? అనే మీమాంస లో పడిపోయాడు. మరోవైపు శంకర్ మళ్ళీ ఇండియన్ 2 సినిమా పైకి వెళ్ళిపోయారు. చరణ్ తో చేస్తున్న సినిమాపై శంకర్ ఏకాగ్రత తప్పింది. అందుకే.. చరణ్ తన కొత్త సినిమాల ఎంపికలో జాగ్రత్త పడుతున్నాడు. నిజానికి చిరంజీవి -చరణ్ కలిసి నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ఆచార్య నే దారుణంగా ఫెయిల్ అయింది.
ఈ స్థాయిలో ఫ్లాప్ అవుతుందని చరణ్ అస్సలు ఊహించలేదు. అందుకే, చరణ్ ఆలోచనలో పడ్డాడు. తన భవిష్యత్ చిత్రాలపై దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టాడు. రామ్ చరణ్ రెండు కొత్త చిత్రాలు ఆల్రెడీ సెట్స్ పై ఉన్నాయి. శంకర్ సినిమా షూటింగ్ చివరి దశకు చేరింది. ఈ సినిమా ఫలితం ఎలా ఉన్నా, తన నటనకు బ్యాడ్ నేమ్ రాకూడదు అని చరణ్, ఈ సినిమా కోసం కసరత్తులు చేస్తున్నాడు.

అందుకే గౌతమ్ తిన్నునూరి సినిమా విషయంలో చరణ్ ఆచితూచి ముందుకు వెళ్తున్నాడు. ఇప్పటికే దర్శకుడు గౌతమ్, చరణ్ ఇమేజ్ కి తగ్గట్లు అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ గా స్క్రిప్ట్ ను సిద్ధం చేశారు. ఆ స్థాయిలోనే సినిమాని తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడు. కానీ చరణ్ మాత్రం ఆచార్య దెబ్బకు, ఇప్పుడు శంకర్ సినిమా దెబ్బకు సైలెంట్ అయిపోయాడు.
అసలు గౌతమ్ కి చరణ్ డేట్లు ఇస్తాడా ? ఇవ్వడా ? అనే డౌట్ కూడా ఉంది. ఒకవేళ ఇవ్వకపోతే ఇక గౌతమ్ కి నిరాశ తప్పదు. మొత్తానికి గౌతమ్ కి పెద్ద షాక్ తగిలింది. గౌతమ్ ఎలాగొలా చరణ్ తో ప్రాజెక్ట్ ఓకె చేయించుకున్నాడు. ఇప్పుడు ఈ సినిమా కూడా పోస్ట్ ఫోన్ అవ్వడంతో పూర్తి నిరాశలో మునిపోయాడు.
[…] Also Read: Ram Charan: రామ్ చరణ్ షాకింగ్ నిర్ణయం.. పాపం ఆ… […]