Bigg Boss 6 Telugu Raj: ఈ ఏడాది భారీ అంచనాల నడుమ ప్రారంభమైన బిగ్ బాస్ సీసన్ 6 ఊహించని మలుపులతో ప్రేక్షకులకు షాక్ మీద షాక్ ఇస్తూ ముందుకి దూసుకుపోతుంది..మొదటి వారం ఎలిమినేషన్స్ ని పెట్టకుండా సరికొత్త ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్..రెండవ వారం లో డబుల్ ఎలిమినేషన్ పెట్టాడు..ఇది నిజంగా ఎవ్వరు ఊహించనిది..ఇక మూడవ వారం మాములుగా ఆదివారం నాడు జరిగే సాధారణ ఎలిమినేషన్స్ లో నేహా ఎలిమినేట్ అయ్యింది..ఇప్పుడు నాల్గవ వారం లో ఎవ్వరు ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా ‘మిడ్ వీక్ ఎలిమినేషన్’ అనే కొత్త పద్దతిని ప్రవేశ పెట్టాడు బిగ్ బాస్..ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్స్ ద్వారా రాజ్ శేఖర్ ఎలిమినేట్ అయ్యినట్టు సోషల్ మీడియా లో వార్తలు వినిపిస్తున్నాయి..ఈ వారం ఇచ్చిన కెప్టెన్సీ టాస్క్ లో వరస్ట్ పెరఫార్మెర్ గా ఎవరు నిలిచారో ఇంటి సభ్యుల వోటింగ్ ద్వారా రాజ్ శేఖర్ నామినేట్ అయ్యాడని..అందువల్ల బిగ్ బాస్ రాజ్ శేఖర్ ని ఎలిమినేట్ చేసాడని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇందులో ఎంత మాత్రం నిజం ఉందొ తెలియాలంటే ఈరోజు రాత్రి వరుకు వేచి చూడాల్సిందే..రాజ్ శేఖర్ బిగ్ బాస్ హౌస్ లో మొదటి వారం లోనే కెప్టెన్ అయినా సంగతి మన అందరికి తెలిసిందే..తొలుత అసలు రాజ్ శేఖర్ ఇంట్లో ఉన్నదా లేడా అని అనిపించేలా ఆడేవాడు..కానీ ఇప్పుడు రోజు రోజుకి తన ఆట తీరుని మార్చుకుంటూ మెరుగుపడ్డాడు..తన గ్రాఫ్ ని బాగా పెంచుకున్నాడు..కానీ కెప్టెన్సీ టాస్కులో పెద్దగా ఆడలేదు..అందుకే ఇంటి సభ్యులందరు అతనిని నామినేట్ చేసారు.

వోటింగ్ ప్రకారం అయితే రాజ్ శేఖర్ ఎలిమినేట్ అయ్యే అవకాశమే లేదు..వోటింగ్ ప్రకారం ప్రస్తుతం డేంజర్ జోన్ లో ఆరోహి రావు మరియు సుదీప కొనసాగుతున్నారు..వీరిద్దరిలోనే ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ..మరి రాజ్ శేఖర్ ని ఈ సరికొత్త పద్దతిలో ఎలిమినేట్ ఎలా చేయగలిగారు..? నిజంగా ఎలిమినేట్ చేసారా..! లేకపోతే అతనిని సీక్రెట్ రూమ్ లోకి పంపించబోతున్నారా అనేది తెలియాల్సి ఉంది..చూడాలిమరి ఈరోజు వచ్చిన ఈ వార్తల్లో ఎంత వరుకు నిజం ఉంది అనేది.