https://oktelugu.com/

Ram Charan : ప్రభాస్ కంటే మహేష్ బాబు బెటర్ అంటూ రామ్ చరణ్ షాకింగ్ కామెంట్స్..మండిపడుతున్న అభిమానులు!

మల్టీ స్టార్రర్ చిత్రం చేయాల్సి వస్తే ప్రభాస్, మహేష్ బాబు, వీళ్ళిద్దరిలో ఎవరితో కలిసి చేస్తావు అని బాలయ్య ఒక ప్రశ్న అడగగా, దానికి రామ్ చరణ్ మహేష్ బాబు తో చేస్తానని క్షణం కూడా ఆలోచించకుండా చెప్పేశాడట. రామ్ చరణ్ కి మహేష్ బాబు కంటే ప్రభాస్ తోనే ఎక్కువ చనువు.

Written By:
  • Vicky
  • , Updated On : January 7, 2025 / 09:54 PM IST

    Ram Charan

    Follow us on

    Ram Charan : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇటీవలే బాలయ్య బాబు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘అన్ స్టాపబుల్ 4’ ఎపిసోడ్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ ఎపిసోడ్ రేపు ఆహా యాప్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ని కూడా మనమంతా చూసే ఉంటాము. రామ్ చరణ్ తో బాలయ్య కాసేపు సరదాగా మాట్లాడిన మాటలు, అదే విధంగా తన కూతురు క్లిన్ కారా ని తల్చుకుంటూ రామ్ చరణ్ ఎమోషనల్ అవ్వడం, ఆ తర్వాత ఆయన స్నేహితులు శర్వానంద్, వికాస్ కూడా ఈ షోలో పాల్గొనడం, చివర్లో రామ్ చరణ్ ప్రభాస్ కి ఫోన్ చేయడం, అతను చరణ్ ని ఆటపట్టించడం వంటివి ఈ ఎపిసోడ్ లో చాలానే ఉన్నాయని ఆ ప్రోమో చూసిన తర్వాత అందరికీ అర్థం అయ్యింది. అయితే ఈ ఎపిసోడ్ లో బాలయ్య అడిగిన ఒక ముఖ్యమైన ప్రశ్నకి రామ్ చరణ్ చెప్పిన సమాధానం బాలయ్య ని సైతం షాక్ కి గురి చేసిందట .

    మల్టీ స్టార్రర్ చిత్రం చేయాల్సి వస్తే ప్రభాస్, మహేష్ బాబు, వీళ్ళిద్దరిలో ఎవరితో కలిసి చేస్తావు అని బాలయ్య ఒక ప్రశ్న అడగగా, దానికి రామ్ చరణ్ మహేష్ బాబు తో చేస్తానని క్షణం కూడా ఆలోచించకుండా చెప్పేశాడట. రామ్ చరణ్ కి మహేష్ బాబు కంటే ప్రభాస్ తోనే ఎక్కువ చనువు. ప్రభాసే రామ్ చరణ్ కి బాగా క్లోజ్ ఫ్రెండ్. అయినప్పటికీ కూడా ప్రభాస్ పేరు చెప్పకుండా, మహేష్ బాబు పేరు చెప్పడానికి అసలు కారణం ఏమిటి అనేది రేపు ఎపిసోడ్ విడుదల అయ్యే వరకు వేచి చూడాల్సిందే. అంతే కాకుండా ఈ ఎపిసోడ్ లో చాలా హైలైట్స్ ఉండబోతున్నాయి. పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా నందన్ మొదటి సినిమాకి సంబంధించి చిన్న అప్డేట్ కూడా రామ్ చరణ్ ఇచ్చినట్టు తెలుస్తుంది.

    సోషల్ మీడియా లో చాలా రోజుల నుండి అకిరా నందన్ ‘ఓజీ’ చిత్రం లో ఒక చిన్న క్యారక్టర్ చేసాడని వార్తలు వినిపించాయి. అది నిజమా కాదా అనేది కూడా ఈ ఎపిసోడ్ లో క్లారిటీ ఇచ్చాడట రామ్ చరణ్. మరి ఆయన ఏమి చెప్పి ఉంటాడో అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే రామ్ చరణ్ ప్రతిష్టాత్మక పాన్ ఇండియన్ చిత్రం ‘గేమ్ చేంజర్’ మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. శంకర్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమాపై అటు అభిమానుల్లోనూ, ఇటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు ఈ చిత్రానికి సంబంధించిన రెండు తెలుగు రాష్ట్రాల అడ్వాన్స్ బుకింగ్స్ పూర్తి స్థాయిలో మొదలు అవ్వలేదు. దీనిపై అభిమానులు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రేపు మధ్యాహ్నం లోపు బుకింగ్స్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి