
Ram Charan: టాలీవుడ్ లో రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాలు మెగా మరియు నందమూరి.నందమూరి కుటుంబం అటు రాజకీయాల్లోనూ ఇటు సినిమాల్లోనూ గొప్పగా రాణించారు.కానీ మెగా కుటుంబం మాత్రం సినిమాల్లో నెంబర్ 1 అయ్యారు కానీ, రాజకీయ పరంగా మాత్రం నందమూరి రేంజ్ సక్సెస్ ని చూడలేకపోయారు.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తో ముందుకు దూసుకెళ్తున్నాడు.
రాబొయ్యే రోజుల్లో రాజకీయ పరంగా కూడా జనసేన ద్వారా మెగా ఫ్యామిలీ కి సక్సెస్ రాబోతుంది.ఇదంతా కాసేపు పక్కన పెడితే ఆస్కార్ అవార్డ్స్ ఈవెంట్ ముగిసిన తర్వాత రామ్ చరణ్ నిన్ననే ఇండియా కి తిరిగి వచ్చాడు.ఇండియాకి రాగానే ఆయన ప్రతిష్టాత్మక ‘ఇండియా టుడే కాంక్లేవ్’ మీటింగ్ లో పాల్గొన్నాడు.అక్కడ ఆయన ఎదురుకున్న కొన్ని ప్రశ్నలు, దానికి ధీటుగా రామ్ చరణ్ చెప్పిన సమాదానాలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

ముఖ్యంగా అక్కడున్న ప్రముఖ జర్నలిస్ట్ ‘రాజ్ దీప్ సర్దేశాయ్’ నందమూరి ఫ్యామిలీ పొలిటికల్ గా సక్సెస్ అయ్యింది, కానీ మీ తండ్రి చిరంజీవి గారు మాత్రం పాలిటిక్స్ లో ఫెయిల్ అయ్యి అవమానం పడ్డారు అంటూ కొనసాగిస్తుండగా రామ్ చరణ్ వెంటనే మైక్ అందుకొని ‘దయచేసి పాలిటిక్స్ గురించి మాట్లాడొద్దు సార్..కేవలం సినిమాల గురించి మాత్రమే మనం మాట్లాడుకుందాము’ అంటూ గట్టిగా చెప్తాడు.

ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.రామ్ చరణ్ కి తన తండ్రిని అవమానిస్తూ మాట్లాడిన ఆ మాటలు చాలా ఇబ్బందిని కలిగించాయి.అవి ఎక్సప్రెషన్స్ ఆయన ముఖం లోనే తెలిసిపోతుంది.ఇలాంటి నేషనల్ మీడియా చానెల్స్ లో ఏమనుకుంటారో అని కూడా చూడకుండా ఇలాంటి ప్రశ్నలు అడగడం ఏమిటి అని రామ్ చరణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో ఇండియా టుడే యాజమాన్యం పై విరుచుకుపడుతున్నారు.