Ram Charan : మెగాస్టార్ చిరంజీవి – శ్రీదేవి కాంబినేషన్ లో జగదేక వీరుడు అతిలోక సుందరి అనే చిత్రం అప్పట్లో ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో తెలిసిందే..ఈ జంట ని వెండితెర మీద చూసిన అభిమానులు పులకరించిపోయారు..మళ్ళీ అలాంటి మ్యాజిక్ చిరంజీవి కొడుకు రామ్ చరణ్ మరియు శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ కాంబినేషన్ తోనే సాధ్యమని అభిమానులు గట్టిగా నమ్ముతారు..అలాంటి ఫ్యాన్స్ కోసం ఇప్పుడు సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న ఒక వార్త గుడ్ న్యూస్ అనే చెప్పాలి..ఎందుకంటే త్వరలోనే వీళ్లిద్దరి కాంబినేషన్ ని వెండితెర మీద చూడబోతున్నాము.

ఇక అసలు విషయానికి వస్తే రామ్ చరణ్ తన 16 వ చిత్రాన్ని ఉప్పెన మూవీ దర్శకుడు బుచ్చి బాబు తో చెయ్యబోతున్నట్టు నిన్న అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రానికి కథని అందిస్తున్నాడు..శ్రీకాకుళం లోని ఒక రూరల్ ప్రాంతానికి చెందిన కథ గా ఈ చిత్రం తెరకెక్కబోతుందట..ఇందులో రామ్ చరణ్ కబడ్డీ ఆటగాడిగా నటిస్తున్నాడు.
ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం జాన్వీ కపూర్ ని సంప్రదిస్తున్నాడట బుచ్చి బాబు.. కథ రాసుకున్నప్పుడే ఈ పాత్రకి ఆమె మాత్రమే న్యాయం చేయగలదని ఆయన బలంగా నమ్మాడట..అందుకే ఆమెతో ఈ కథ గురించి సంప్రదింపులు జరపబోతున్నట్టు సమాచారం..అన్నీ కుదిరితే ఈ సినిమాతోనే జాన్వీ కపూర్ టాలీవుడ్ లోకి అడుగుపెట్టబోతుంది అని చెప్పొచ్చు..ఇది వరకే ఆమె బాలీవుడ్ లో పలు సినిమాలలో నటించినా ఆమె కెరీర్ కి బూస్ట్ ని ఇచ్చే ఒక్క హిట్ కూడా పడలేదు.
అదే ఆమె తెలుగులోకి వస్తే ఆమెతో సినిమాలు చెయ్యడానికి దర్శక నిర్మాతలు క్యూ కట్టేస్తారు..రెమ్యూనరేషన్ ఎంత డిమాండ్ చేసిన వెనకాడరు..మరి ఈ క్రేజీ కాంబినేషన్ సెట్ అవుతుందో లేదో చూడాలి..ప్రస్తుతం రామ్ చరణ్ సౌత్ ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే..ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం న్యూజిలాండ్ లో జరుగుతుంది..అయితే ఈ సినిమాతో పాటు బుచ్చి బాబు సినిమాని కూడా సమాంతరం గా పూర్తి చెయ్యాలని రామ్ చరణ్ ఆలోచిస్తోస్తున్నాడట..జనవరి నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.