Peddi Movie Vs Fauji Movie: గత ఏడాది దసరా టాలీవుడ్ కి కాసుల కనక వర్షం కురిపించింది. పవన్ కళ్యాణ్ ‘ఓజీ’, అదే విధంగా ‘కాంతారా 2’ చిత్రాలు వారం రోజుల గ్యాప్ లో పోటీ పడ్డాయి. రెండు కూడా కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఈ దసరా కి కూడా ఆసక్తికరమైన పోటీ జరగబోతుందని టాక్. పూర్తి వివరాల్లోకి వెళ్తే ప్రభాస్ ఫిబ్రవరి 2 నుండి ‘కల్కి 2’ షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. పది రోజుల పాటు జరగనున్న ఈ షెడ్యూల్ తర్వాత ఆయన తన పూర్తి స్థాయి డేట్స్ ని ‘ఫౌజీ’ చిత్రానికి కేటాయించినట్టు సమాచారం. సాధ్యమైనంత తొందరగా ఈ సినిమా షూటింగ్ ని పూర్తి చేసి, ఈ దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొని రావాలని చూస్తున్నాడట. హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటి వరకు 50 శాతం కి పైగానే అయ్యింది.
ప్రభాస్ ఇక కేవలం నెల రోజుల సమయం ఇస్తే సరిపోతుంది. అందుకే ‘స్పిరిట్’ మూవీ షూటింగ్ కి కూడా కొన్నాళ్ళు బ్రేక్ ఇచ్చి, ముందు ఈ చిత్రాన్ని పూర్తి చెయ్యాలని చూస్తున్నాడు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ దసరా కి ఈ చిత్రం థియేటర్స్ లో సందడి చేయబోతుంది. మరో పక్క గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ చిత్రం కూడా దసరా రేస్ లో నిల్చినట్టు సమాచారం. వాస్తవానికి ఈ చిత్రాన్ని మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చెయ్యాలని అనుకున్నారు. ఆమేరకు షూటింగ్ ని పరుగులు తీయించే ప్రయత్నం చేశారు. కానీ ఎంత ప్రయత్నం చేసినా ఈ సినిమా షూటింగ్ ఇంకా రెండు నెలా వరకు బ్యాలన్స్ ఉందట.
అందుకే వాయిదా వేసి మే 1న విడుదల చేస్తే ఎలా ఉంటుంది అనుకున్నారు. ఇప్పుడు ఆ ఆలోచన కూడా విరమించినట్టు తెలుస్తోంది. దసరా కి విడుదల చెయ్యాలని అనుకుంటున్నారట. సినిమా పూర్తి అయ్యాక పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మీద డైరెక్టర్ బుచ్చి బాబు చాలా సమయం తీసుకుంటాడు. అందుకే ప్రశాంతంగా దసరా సెలవుల్లో ఈ చిత్రాన్ని విడుదల చెయ్యాలని చూస్తున్నారట. ఒకపక్క రామ్ చరణ్ పెద్ది, మరోపక్క ప్రభాస్ ఫౌజీ, టాలీవుడ్ కి మరో భారీ టర్నోవర్ ఇచ్చే సీజన్ రాబోతుంది. ప్రస్తుతానికి అయితే పెద్ది హైప్ వేరే లెవెల్ లో ఉంది. ‘ఫౌజీ’ నుండి ఇప్పటి వరకు పెద్దగా ప్రమోషనల్ కంటెంట్ రాలేదు , అసలు ఈ సినిమా ఉంది అనే విషయం కూడా ఆడియన్స్ కి తెలియదు. కానీ రాబోయే రోజుల్లో మాత్రం ఈ చిత్రం మంచి అంచనాలను క్రియేట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కానీ కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కువగా ‘పెద్ది’ లో ఉంటుంది కాబట్టి, ఈ దసరా కి ఆ చిత్రమే పై చెయ్యి సాధించే అవకాశాలు ఎక్కువ.