https://oktelugu.com/

Ram Charan : ‘అకిరా నందన్ వల్లే నేను ఈరోజు ఇలా తయారు అయ్యాను’ అంటూ రామ్ చరణ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు!

నిన్న 'అన్న స్టాపబుల్ 4' ఎపిసోడ్ కి రామ్ చరణ్ ముఖ్య అతిథిగా పాల్గొని సందడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఎపిసోడ్ లో ఆయన అభిమానులకు తెలియని ఎన్నో విషయాలను పంచుకున్నాడు.

Written By:
  • Vicky
  • , Updated On : January 1, 2025 / 08:45 AM IST

    Ram Charan

    Follow us on

    Ram Charan : నిన్న ‘అన్న స్టాపబుల్ 4’ ఎపిసోడ్ కి రామ్ చరణ్ ముఖ్య అతిథిగా పాల్గొని సందడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఎపిసోడ్ లో ఆయన అభిమానులకు తెలియని ఎన్నో విషయాలను పంచుకున్నాడు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా నందన్ గురించి ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. అకిరా నందన్ తన తండ్రి లాగానే మితభాషి. ఎక్కువగా మాట్లాడడు, కానీ చాలా టాలెంటెడ్. మ్యూజిక్, మార్షల్ ఆర్ట్స్ తో పాటు డ్యాన్స్ లో కూడా మంచి నేర్పరి. పవన్ కళ్యాణ్ చదువుకున్నది ఇంటర్మీడియట్ వరకే, కానీ పెద్దయ్యాక పుస్తకాల పురుగు లాగా మారిపోయాడు. షూటింగ్ లో బ్రేక్ దొరికితే చాలు పుస్తకాలు చదువుతుంటాడని, ఆయన ఇంటికి వెళ్తే ఒక లైబ్రరీ ని చూసినట్టుగా అనిపిస్తుందని, ఆయనకి ఉన్నంత పరిజ్ఞానం లక్షలు పోసి డిగ్రీలు చదువుకున్న వాళ్లకు కూడా లేదని అనేవాళ్ళు కళ్యాణ్ సన్నిహితులు.

    ఇదే అలవాటు అకిరా నందన్ కి కూడా వచ్చిందట. నిన్న అన్ స్టాపబుల్ షో లో అకిరా గురించి ప్రస్తావన వచ్చినప్పుడు రామ్ చరణ్ మాట్లాడుతూ ‘అకిరా కి కూడా వాళ్ళ నాన్న అలవాట్లు చాలా వచ్చాయి. ఎక్కువ మాట్లాడడు, కానీ పనులు మాత్రం వేరే లెవెల్ లో ఉంటాయి. నాకు మామూలుగానే పుస్తకాలు చదివే అలవాటు లేదు. కానీ వాడు పుస్తకాల పురుగు. నాకు అనేక పుస్తకాలు బహుమతిగా ఇచ్చాడు. వాటిని ఒకసారి చదవడం మొదలు పెట్టాను. నాకు కూడా అలవాటు అయిపోయింది. ఈరోజు నేను ఇలా పుస్తకాలు చదువుతున్నాను అంటే అందుకు కారణం అకిరా గాడే’ అంటూ రామ్ చరణ్ చెప్పుకొచ్చాడట. ఇలాంటివి ఎన్నో సంఘటనలు ఆయన ఈ అన్ స్టాపబుల్ ఎపిసోడ్ లో పంచుకున్నాడు. మెగా మరియు నందమూరి అభిమానులకు ఈ ఎపిసోడ్ ఒక కనుల పండుగ లాగా ఉండబోతుంది. జనవరి మొదటి వారం లో ఆహా లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

    ఇకపోతే ఈ ఎపిసోడ్ లో స్పెషల్ అట్రాక్షన్ గా రామ్ చరణ్ స్నేహితులు శర్వానంద్, వికాస్ విచ్చేసారు. మధ్యలో ప్రభాస్ తో రామ్ చరణ్ జరిపిన ఫోన్ కాల్ సంభాషణ హైలైట్ గా నిల్చింది. గత సీజన్ లో ప్రభాస్ ముఖ్య అతిథిగా వచ్చినప్పుడు, రామ్ చరణ్ తో జరిపిన ఫోన్ కాల్ సంభాషణ ఎంత క్లిక్ అయ్యిందో, ఈసారి అంతకు మించి సూపర్ గా క్లిక్ అయ్యిందని సమాచారం. త్వరలో విడుదల చేయబోయే ప్రోమో లోనే ప్రభాస్ తో చేసే చిట్ చాట్ కి సంబంధించిన షాట్స్ ని చూపించబోతున్నారు. ఇక త్వరలో విడుదల కాబోతున్న రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ చిత్రం గురించి కూడా బోలెడన్ని విశేషాలను పంచుకున్నారట. ఈ ఎపిసోడ్ చివర్లో ఆ చిత్ర నిర్మాత దిల్ రాజు కూడా ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు.