https://oktelugu.com/

Ram Charan : రామ్ చరణ్ గేమ్ చేంజర్ తో సక్సెస్ కొట్టాలంటే అందులో ఇలాంటి ఎలిమెంట్స్ ఉండాలి..

ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం ఒకటైపోయింది. అందువల్లే కొత్త కథలు వస్తూ ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం అయితే చేస్తున్నాయి. ఇక ఎప్పుడైతే కొత్త కథలు వస్తాయో అప్పుడే సినిమా ఇండస్ట్రీలో మార్పు మొదలవుతుంది. ఇక సగటు ప్రేక్షకుడిని అలరించే కథలు కూడా రావడం వల్ల ప్రేక్షకులు ఆ సినిమాలను చూడడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఇక ఏది ఏమైనా కూడా ప్రేక్షకులు సినిమాలను చూస్తేనే అవి బ్లాక్ బాస్టర్లుగా మారుతాయి లేకపోతే మాత్రం అవి డిజాస్టర్లు గా మిగిలిపోతాయి...

Written By:
  • Gopi
  • , Updated On : November 10, 2024 / 02:51 PM IST

    Ram Charan

    Follow us on

    Ram Charan : గేమ్ చేంజర్ సినిమా నుంచి టీజర్ అయితే వచ్చింది. చాలా రోజుల సస్పెన్స్ కి తెరలేపుతూ ఈ సినిమాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక శంకర్ ఈ సినిమాని అత్యద్భుతమైన సినిమాగా నిలిపే ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. టీజర్ లో రామ్ చరణ్ యాక్షన్ ఎపిసోడ్స్ చాలా వైల్డ్ గా ఉన్నట్టుగా కూడా అర్థమవుతుంది. ఇక ఏది ఏమైనప్పటికి ఈ సినిమాతో పెను సంచలనాన్ని సృష్టించడానికి అటు రామ్ చరణ్ ఇటు శంకర్ ఇద్దరు కలిసి భారీ ప్రణాళికలు రూపొందిస్తున్నారు…ఇక ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని అందుకొని ఇండియాలోనే వన్ ఆఫ్ ది టాప్ డైరెక్టర్ గా ఎదగాలని శంకర్ భావిస్తుంటే రామ్ చరణ్ కూడా ఈ సినిమాతో 1000 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టి సోలో హీరోగా తన దమ్ము ఏంటో చూపించాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఏది ఏమైనప్పటికి ఇద్దరు కలిసి చేస్తున్న ఈ ప్రయత్నం ప్రేక్షకులను మెప్పిస్తుందని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. నిజానికైతే ఈ సినిమా సక్సెస్ సాధిస్తేనే శంకర్ కెరియర్ అనేది గాడిలో పడుతుంది. లేకపోతే మాత్రం ఆయనకు అవకాశం ఇచ్చే హీరోలు కరువు అవుతారు.

    ఇక ఏది ఏమైన కూడా తమదైన రీతిలో సత్తా చాటాలి అంటే మాత్రం ఈ సినిమాతో వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది… ఇక రామ్ చరణ్ ఎప్పుడైతే ఈ మూవీ స్టార్ట్ చేశారో అప్పటినుంచి వేరే సినిమాకి కమిట్ అవ్వకుండా ఈ ఒక్క సినిమానే చేస్తూ ముందుకు సాగాడు.

    దాదాపు మూడు సంవత్సరాల నుంచి ఈ ఒక్క సినిమా కోసమే తన డేట్స్ మొత్తాన్ని కేటాయించాడు. మరి ఇలాంటి సందర్భంలో రామ్ చరణ్ ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తేనే ఆయన పడిన కష్టానికి ఆయన ఈ సినిమా మీద పెట్టిన సమయానికి బ్యాలెన్స్ అవుతుంది లేకపోతే మాత్రం ఆయనకు భారీ నష్టం జరిగే అవకాశం కూడా ఉంది…

    ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వాలంటే మాత్రం ఇందులో ఎమోషన్, ఎలివేషన్ రెండు కూడా పీక్ స్టేజ్ లో ఉంటే తప్ప ఈ సినిమా ప్రేక్షకులకు అంత బాగా కనెక్ట్ అవ్వదు అంటూ సగటు సినీ మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…