https://oktelugu.com/

Game Changer Movie : సోషల్ మీడియా లో లీకైన రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ ఇంట్రడక్షన్ సన్నివేశం..హైప్ పెంచడం కోసమే లీక్ చేసారా?

ఈ టీజర్ కోసం అభిమానులు సోషల్ మీడియా లో నిర్మాత దిల్ రాజు & టీం తో పెద్ద యుద్ధమే చేసారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ సినిమాలో పాటలు చూడడమే కానీ, కంటెంట్ ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. అందువల్ల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ కూడా ఇంకా ప్రారంభం కాలేదు.

Written By:
  • Vicky
  • , Updated On : November 3, 2024 / 08:10 PM IST

    Game Changer Movie

    Follow us on

    Game Changer Movie :  గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘గేమ్ చేంజర్’ చిత్రం కోసం అటు అభిమానులు ఎంతలా ఎదురు చూస్తున్నారో, ఇటు ప్రేక్షకులు కూడా అంతలా ఎదురు చూస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 10 వ తారీఖున తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల అవ్వబోతున్న ఈ సినిమా నుండి ఇప్పటి వరకు రెండు పాటలు విడుదలయ్యాయి. ఈ రెండు పాటలకు ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా లిరికల్ వీడియో సాంగ్స్ లో శంకర్ పెట్టిన విజువల్స్ ని చూస్తుంటే ఆయన పాత సినిమాల్లోని పాటలు గుర్తుకొచ్చాయి. ఈ నెల 9వ తారీఖున ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని విడుదల చేయబోతున్నారు. ఈ టీజర్ కోసం అభిమానులు సోషల్ మీడియా లో నిర్మాత దిల్ రాజు & టీం తో పెద్ద యుద్ధమే చేసారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ సినిమాలో పాటలు చూడడమే కానీ, కంటెంట్ ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. అందువల్ల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ కూడా ఇంకా ప్రారంభం కాలేదు.

    ఎందుకంటే శంకర్ గత చిత్రం ‘ఇండియన్ 2’ కమర్షియల్ గా ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ఆయన పూర్తిగా ఫామ్ లో లేకపోవడం వల్ల నిర్మాత దిల్ రాజు అడిగినంత డబ్బులు ఇవ్వలేకపోతున్నారు బయ్యర్స్. కానీ టీజర్ తర్వాత లెక్కలు మారనుంది. రీసెంట్ గా టీజర్ విడుదల తేదీని ప్రకటిస్తూ ఒక సరికొత్త పోస్టర్ ని మూవీ టీం విడుదల చేయడం మీరంతా చూసే ఉంటారు. ఈ పోస్టర్ లో రామ్ చరణ్ రైలు పట్టాల మీద నలుగురిని పడుకోబెట్టి, స్టైల్ గా లుంగీ కట్టుకొని కూర్చొని ఉంటాడు. ఇది చూడగానే అభిమానులకు గూస్ బంప్స్ వచ్చాయి. ఇంత మాస్ యాంగిల్ లో మా హీరోని చూసి చాలా రోజులైంది, డైరెక్టర్ శంకర్ మన ఊహలకి అందని రేంజ్ సినిమాని ఇచ్చినట్టు ఉన్నాడు అంటూ ఫ్యాన్స్ మురిసిపోయారు.

    అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సన్నివేశం గురించి ఆసక్తికరమైన విషయాలు సోషల్ మీడియా లో లీక్ అయ్యింది. అదేమిటంటే రామ్ చరణ్ ట్రైన్ లో ప్రయాణిస్తున్న సమయంలో, విలన్ గ్యాంగ్ హెలికాఫ్టర్ లో ఛేజ్ చేస్తారు. హెలికాఫ్టర్ నుండి విలన్ గ్యాంగ్ ట్రైన్ మీదకు దూకి రామ్ చరణ్ పై దాడి చేసే ప్రయత్నం చేయగా, రామ్ చరణ్ వాళ్ళతో చేసే ఫైట్ సన్నివేశం వేరే లెవెల్ లో ఉంటుందని, ఇప్పటి వరకు శంకర్ తీసిన అన్ని సినిమాలలో ఈ ఫైట్ సన్నివేశం ది బెస్ట్ గా వచ్చిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. కేవలం ఈ పోరాట సన్నివేశాన్ని తెరకెక్కించడం కోసం 20 కోట్ల రూపాయిల బడ్జెట్ ని ఖర్చు చేశారట. మొన్న విడుదలైన పోస్టర్ ఈ పోరాట సన్నివేశానికి సంబంధించినదే అట. ఈ ఒక్క సన్నివేశం చాలు, సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడానికి అంటూ సోషల్ మీడియా లో రామ్ చరణ్ అభిమానులు చెప్పుకొస్తున్నారు.