https://oktelugu.com/

Anil Ravipudi : వెంకటేష్ కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్న అనిల్ రావిపూడి..ఇరకాటంలో పడ్డ దిల్ రాజు!

ఈ సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. అదేమిటంటే అనిల్ రావిపూడి ఈ చిత్రానికి విక్టరీ వెంకటేష్ ని మించిన రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని భోగట్టా. పూర్తి వివరాల్లోకి వెళ్తే ప్రతీ సినిమాకి 10 కోట్ల రూపాయిల రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకునే వెంకటేష్, ఈ చిత్రానికి ఏకంగా 18 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకుంటున్నాడట.

Written By:
  • Vicky
  • , Updated On : November 3, 2024 / 07:40 PM IST

    Anil Ravipudi

    Follow us on

    Anil Ravipudi : మన టాలీవుడ్ లో రాజమౌళి తర్వాత వంద శాతం సక్సెస్ రేట్ ఉన్న దర్శకులలో ఒకడు అనిల్ రావిపూడి. శ్రీనువైట్ల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు పని చేసిన అనిల్ రావిపూడి, కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ‘పటాస్’ అనే చిత్రం ద్వారా డైరెక్టర్ గా మారాడు. ఆ చిత్రం కమర్షియల్ గా భారీ బ్లాక్ బస్టర్ అవ్వడంతో అనిల్ రావిపూడి కి వరుసగా ఆఫర్లు క్యూలు కట్టాయి. పటాస్ తర్వాత ఆయన చేసిన సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్2 ,సరిలేరు నీకెవ్వరూ, ఎఫ్3 , భగవంత్ కేసరి వంటి చిత్రాలు చేసాడు. ఇవన్నీ కమర్షియల్ గా భారీ బ్లాక్ బస్టర్స్ గా నిల్చిన చిత్రాలే. అందుకే ఆయనతో సినిమాలు చేసేందుకు స్టార్ హీరోలు సైతం ఇష్టపడుతున్నారు. రీసెంట్ గానే ఈయన విక్టరీ వెంకటేష్ తో ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే చిత్రం చేస్తున్నాడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లు గా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ని రీసెంట్ గానే విడుదల చేయగా, దానికి ఫ్యాన్స్ నుండి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

    ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. అదేమిటంటే అనిల్ రావిపూడి ఈ చిత్రానికి విక్టరీ వెంకటేష్ ని మించిన రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని భోగట్టా. పూర్తి వివరాల్లోకి వెళ్తే ప్రతీ సినిమాకి 10 కోట్ల రూపాయిల రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకునే వెంకటేష్, ఈ చిత్రానికి ఏకంగా 18 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకుంటున్నాడట. అదే విధంగా అనిల్ రావిపూడి కూడా రెమ్యూనరేషన్ విషయంలో నిర్మాతకు ఫ్యూజులు ఎగిరిపోయేలా చేసాడట. ఇంతకు ముందు ఒక్కో సినిమాకి 5 నుండి 10 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని తీసుకునే అనిల్ రావిపూడి, ఈ చిత్రానికి ఏకంగా 25 కోట్ల రూపాయిలు డిమాండ్ చేస్తున్నాడట. దిల్ రాజు అంత ఇవ్వడానికి సుముఖత చూపలేదట.

    ప్రీ రిలీజ్ బిజినెస్ అంచనాలకు తగ్గట్టుగా జరిగితే నువ్వు అడిగిన రెమ్యూనరేషన్ గురించి ఆలోచిస్తానని, ఒకవేళ అనుకున్న స్థాయిలో జరగకపోతే 10 కోట్ల రూపాయిలతోనే సరిపెట్టుకోవాలని చెప్పాడట దిల్ రాజు. ఈ విషయం లో వీళ్లిద్దరి మధ్య చిన్నపాటి కోల్డ్ వార్ నడిచిందట. కానీ షూటింగ్ కి అంతరాయం కలిగించకుండా, దిల్ రాజు చెప్పిన డీల్ ని అనిల్ రావిపూడి ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. అనిల్ రావిపూడి సినిమాలకు ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. మన టాలీవుడ్ పాన్ ఇండియన్ స్టార్ హీరోలు కూడా ఒక కమర్షియల్ సినిమా చేయాలనుకుంటే ఇప్పుడు వాళ్లకు అనిల్ రావిపూడి తప్ప మరో ఛాయస్ లేదు. ఆ రేంజ్ కి తన స్థాయిని పెంచుకున్నాడు అనిల్ రావిపూడి. అంతే కాదు ఈయన చేతిలో పవన్ కళ్యాణ్ సినిమా, జూనియర్ ఎన్టీఆర్ సినిమా కూడా ఉందట. భవిష్యత్తులో ఇవి పట్టాలెక్కనున్నాయి, మరి ఆ స్థాయి ఉన్న డైరెక్టర్ ఈ రేంజ్ లో రెమ్యూనరేషన్ ని డిమాండ్ చేయడం కూడా న్యాయమే కదా అని అంటున్నారు ట్రేడ్ పండితులు.