https://oktelugu.com/

TANA : అట్టహాసంగా తానా కల్చరల్‌ ఈవెంట్స్‌ ఫైనల్‌.. తానా కల్చరల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహణ!

ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఆగస్టు నుంచి నిర్వహిస్తున్న తానా కల్చరల్‌ కాంపిటీషన్‌ పోటీలు తుది దశకు చేరుకున్నాయి. నవంబర్‌ 2న నార్త్‌ కరోలినాలో అట్టహాసంగా ఫైనల్‌ ఈవెంట్స్‌ నిర్వహించారు.

Written By:
  • NARESH
  • , Updated On : November 3, 2024 / 08:39 PM IST

    TANA

    Follow us on

    TANA : ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) తెలుగువారి ఐక్యత కోసం దాదాపు అర్ధ శతాబ్దంగా కృషి చేస్తోంది. అమెరికాలో స్థిరపడినవారితోపాటు అమోరికాకు కొత్తగా వచ్చేవారిని ఐక్యం చేస్తోంది. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను భావి తరాలకు అందిస్తోంది. తెలుగు భాష, తెలుగు పండుగలు, తెలుగు ఉత్సవాలు, తెలుగు వేడుకలు నిర్వహిస్తోంది. తెలుగువారి ఉన్నతికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తోంది. అమెరికా గడ్డపై తెలుగుదనం ఉట్టిపడేలా చేస్తోంది.

    ఈ క్రమంలో రెండేళ్లకోసారి నిర్వహించే తానా మహా సభలకు సమాయత్తం అవుతోంది. 2025లో తానా మహా సభలు జరుగనున్నాయి. ఇదిలా ఉంటే..  తానా కల్చరల్‌ సర్వీస్‌ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ ఉమా ఆర్‌. కటికి ఆధ్వర్యంలో ఈ పోటీలు జరుగుతున్నాయి. మొదట రీజయిన్ల వారీగా ప్రాథమిక పోటీలు నిర్వహించారు.

    -పోటీలు ఇలా..

    తానా కల్చరల్‌ కాంపిటీషన్‌–2024 పోటీల్లో భాగంగా గీతాలాపన(శాస్త్రీయ సంగీతం, జానపదం, సినిమా), నాట్యం పోటీలు 0–9, 10–14, 15–25 ఏళ్ల విభాగాలుగా నిర్వహించారు. 25 ఏళ్లు పైబడిన వారికి డ్యాన్స్‌ జోడీ పోటీలు నిర్వహించారు.

    ఇందులో భార్య–భర్తలు మాత్రమే పాల్గొనే అవకాశం కల్పించారు. పాటల పోటీల విజేతలకు వాయిస్‌ ఆఫ్‌ తానా అవార్డు, డాన్స్‌లో విజేతలకు తానా అల్టిమేట్‌ డాన్స్‌ ఛాంపియన్‌ అవార్డు ఇవ్వనున్నారు. జోడీ డాన్స్‌లో తానా డాన్స్‌ జోడీ అవార్డు ఇస్తారు. రీజియన్ల వారీగా నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేయడంతోపాటు తర్వాతి పోటీలకు ఎంపిక చేశారు. తాజాగా పోటీలు ఫైనల్‌కు చేరాయి. వివిధ రీజియన్లలో నిర్వహించిన పోటీల్లో విజేతలుగా నిలిచినవారిని ఫైనల్‌కు ఎంపిక చేశారు.

    -నవంబర్‌ 2న ఫైనల్స్‌…

    చికాగోలో ఆగస్టు 3 నుంచి తానా క ల్చరల్‌ కాంపిటీషన్‌ –2024 పోటీలు ప్రారంభమయ్యాయి. తానా కల్చరల్‌ సర్వీస్‌ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ ఉమా ఆర్‌. కటికి(ఆరమండ్ల) పోటీలను పర్యవేక్షిస్తున్నారు. నవంబర్‌ 2న నార్‌ కరోలినాలో ర్యాలీలో ఫైనల్‌ పోటీలు అట్టహాసంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉదయగిరి ఎమ్మెల్యే సురేశ్‌ కాకర్ల హాజరయ్యారు. మరో గెస్ట్‌గా హీరోయిన్‌ శివానీ రాజశేఖర్‌ హాజరయ్యారు. ఫైనల్‌ పోటీలు వీక్షించేందుకు సుమారు 1,200 మందికి పైగా వీక్షకులు హాజరయ్యారు.

    ఫైనల్‌ విజేతలకు పాటల పోటీల విజేతలకు వాయిస్‌ ఆఫ్‌ తానా, డ్యాన్స్‌ పోటీల విజేతకు అల్టిమేట్‌ డ్యాన్స్‌ ఛాంపియన్స్‌ టైటిల్‌తోపాటు ప్రైజ్‌మనీ అందించారు. విజేతలకు ఎమ్మెల్యే సురేశ్‌ కాకర్ల, తానా కల్చరల్‌ సర్వీసెస్ కో-ఆర్డినేటర్‌ ఉమా.ఆర్‌.కటికి (ఆరమండ్ల), స్థానిక మేయర్‌ టీజే.కాల్వే మరియు స్పాన్సర్స్ బహుమతులు ప్రదానం చేశారు.

    * డ్యాన్స్‌ చేసిన మేయర్‌

    వేడుకలకు అతిథిగా హాజరైన నార్త్‌ కరోలినా మోరిస్ విల్లే మేయర్‌ టీజే కాల్వే పోటీలను వీక్షిస్తూ ఎంజయ్‌ చేశారు. ఉదయం నుంచి రాత్రి వరకు పోటీలు జరిగాయి. మొత్తం అన్ని విభాగాల్లో 200కు పైగా కళాకారులు పోటీ పడ్డారు. ఈ సందర్భంగా తనలోని ఉత్సాహాన్ని ఆపుకోలేకపోయిన మేయర్‌ కూడా వేదికపైకి వచ్చి కాసేపు డ్యాన్స్‌ చేసి అందరినీ ఉత్సాహపరిచారు. అనంతరం జడ్జీలు విజేతలను ప్రకటించారు.

    -కృతజ్ఞతలు తెలిపిన కల్చరల్‌ కోఆర్డినేటర్ డా.ఉమా ఆర్‌. కటికి(ఆరమండ్ల)

    విజేతలకు బహుమతుల ప్రధానం అనంతరం తానా కల్చరల్‌ కోఆర్డినేట్‌ డా.ఉమా ఆర్‌. కటికి(ఆరమండ్ల)గారు మాట్లాడారు. మూడు నెలలు రీజియన్ల వారీగా పోటీలు నిర్వహించిన నిర్వాహకులకు, ఫైనల్‌ వేడుకలను విజయవంతం చేసిన తానా సభ్యులకు, వేడుకలను వీక్షించేందుకు వచ్చిన ప్రజలకు, ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు ప్రధానం చేసిన అతిథులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.

    కార్యక్రమాన్ని నిర్వహించి సక్సెస్‌ చేసిన తానా అప్లాచియన్ రీజనల్ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ యార్లగడ్డ టీం అద్భుతంగా నిర్వహించారు. తన టీంను సమన్వయం చేసుకొని కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లారు. నెలరోజులుగా ఈ టీం ఈవెంట్ సక్సెస్ కోసం కష్టపడ్డారు..

    రాజేష్‌ యార్లగడ్డను, ఆయన టీంను డా.ఉమా ఆర్‌. కటికి(ఆరమండ్ల) గారు ప్రత్యేకంగా అభినందించారు.