Mahesh Babu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాజమౌళి లాంటి ఒక గొప్ప దర్శకుడు ఉండడం నిజంగా మన అదృష్టం అనే చెప్పాలి. తెలుగు లో మొదలైన ఆయన ప్రస్థానం ప్రస్తుతం ప్రపంచ సినిమా స్థాయికి వెళ్లిందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక అలాంటి రాజమౌళి మన తెలుగు వాడే అని అందరూ గర్వంగా చెప్పుకోవాలి. రాజమౌళి ఇప్పటివరకు పాన్ ఇండియాలో నెంబర్ వన్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో కూడా తన సత్తాని చాటి అక్కడ కూడా ది బెస్ట్ డైరెక్టర్ గా నిరూపించుకోవాలని చూస్తున్నాడు.
ఇక అందులో భాగంగానే ఆయన మహేష్ బాబు తో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో తెలుగు సినిమా స్థాయి మరింత ఉన్నత శిఖరాలకు చేరుతుంది అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. అయితే వీళ్ళ కాంబోలో వస్తున్న సినిమా ‘ఇండియానా జోన్స్’ ఇన్స్పిరేషన్ తెరకెక్కుతున్న నేపథ్యంలో ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలు అయితే ఉన్నాయి.
అయితే ఈ సినిమా ఇంకా సెట్స్ మీదకు వెళ్లక ముందే ఈ సినిమా నుంచి రోజుకొక న్యూస్ బయటకు వస్తుంది. ఇక ఇదిలా ఉంటే నాగార్జున ఈ సినిమాలో ఒక కీలక పాత్రను పోషిస్తున్నాడు అనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇక నాగార్జున నటించబోయే క్యారెక్టర్ కూడా చాలా కొత్తగా ఉండబోతున్నట్టు గా తెలుస్తుంది. అయితే ఈ క్యారెక్టర్ సినిమాలో ఎప్పుడొస్తుంది అనేది ఇంకా తెలియడం లేదు. కానీ సినిమా యూనిట్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం అయితే నాగార్జున ఈ సినిమాలో 30 నిమిషాల పాటు కనిపిస్తాడని తెలుస్తుంది.
అయితే ఈ క్యారెక్టర్ నాగార్జున తన కెరియర్ లో ఇప్పటివరకు పోషించనటువంటి ఒక వైవిధ్యమైన పాత్ర కావడంతో అందుకే ఈ పాత్ర కోసం తనని తీసుకుంటున్నట్టుగా సినిమా యూనిట్ నుంచి సమాచారం అయితే అందుతుంది. ఇక ఇది ఇలా ఉంటే ఈ సంక్రాంతి కి నా సామిరంగ సినిమాతో వచ్చిన నాగార్జున దాంతో ఒక ఫ్లాప్ ని మూటగట్టుకున్నాడనే చెప్పాలి.