Ram Charan Twins: రామ్ చరణ్(Global Star Ram Charan), ఉపాసన(Upasana Konidela) దంపతులు రీసెంట్ గానే కవలపిల్లలకు జన్మని ఇవ్వడం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అభిమానులు అయితే మెగా ఫ్యామిలీ సభ్యులు ఎంత ఆనందించారో, అంతకంటే ఎక్కువ ఆనందించారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే మొదటి నుండి అభిమానుల్లో పుట్టిన ఇద్దరు బిడ్డలకు రామ్ చరణ్ దంపతులు ఎలాంటి పేర్లు పెడుతారా అని ఆతృతగా ఎదురు చూస్తూండేవారు. మొదటి పాపకు అందరి అంచనాలకు దీటుగా అలోచించి లలిత సహస్ర నామాల్లోని క్లిన్ కారా అనే పేరు ని పెట్టారు. ఇక కవలపిల్లలకు కూడా అదే తరహా లో ఆలోచిస్తారని అంతా అనుకున్నారు. కొడుక్కి రొటీన్ పేరే పెట్టారు కానీ, కూతురు కి మాత్రం కాస్త డిఫరెంట్ పేరు పెట్టారు. నిన్న నే ఈ కార్యక్రమం మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో గ్రాండ్ గా జరిగింది.
ఇక అసలు విషయం లోకి వెళ్తే రామ్ చరణ్, ఉపాసన దంపతులు తమ కొడుక్కి ‘శివరామ్ కొణిదెల’ అని నామకరణం చేశారు. మెగాస్టార్ చిరంజీవి అసలు పేరు శివ శంకర వరప్రసాద్. ఆయన పేరు నుండి శివ, అలాగే తన పేరు నుండి రామ్ ని తీసుకొని శివరామ్ అని పేరు పెట్టారు. అదే విధంగా కూతురు కి ‘అన్వీరా దేవి కొణిదెల’ అని నామకరణం చేశారు. బాగా గమనిస్తే, ఇందులో మనం చిరంజీవి గారి తల్లి అంజనా దేవి పేరు ని చూడొచ్చు. పేరులోని రెండవ భాగం ‘దేవి’ అనేది ఆమె పేరు నుండే తీసుకున్నారు. అదే విధంగా ‘అంజనా’ అనే పేరు నుండి ‘అన్’, చిరంజీవి పేరు నుండి ‘వీ’, ఈ రెండిటినీ కలిపి అన్వీరా అని పెట్టారు. ఓవరాల్ గా ‘అన్వీరా దేవి కొణిదెల’ అని నామకరణం చేశారు. దీనిని బట్టీ రామ్ చరణ్ కి తన తండ్రి మీద ఎలాంటి ప్రేమ ఉంది అనేది అర్థం చేసుకోవచ్చు.
పవన్ కళ్యాణ్ కూడా తన చిన్న కొడుక్కి చిరంజీవి అసలు పేరు కలిసొచ్చేలా ‘మార్క్ శంకర్ పవనోవిచ్’ అని పేరు పెట్టాడు . బహుశా బాబాయ్ అడుగుజాడల్లోనే, తన ఇద్దరి కవలపిల్లలకు ఆయన పేర్లు పెట్టి ఉంటాడని అభిమానులు అనుకుంటున్నారు. ఇకపోతే ప్రస్తుతం రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీ షూటింగ్ లో ఫుల్ బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 30 న ఈ చిత్రం విడుదల అవ్వబోతున్న సందర్భంగా, టార్గెట్ ని చేరుకోవడం కోసం రేయింబవళ్లు షూటింగ్ చేస్తూ ఉన్నాడు. ఇంకా 20 రోజుల షూటింగ్ బ్యాలన్స్ ఉంది. త్వరలోనే రీ రికార్డింగ్ వర్క్ ని కూడా మొదలు పెట్టబోతున్నారు. ఏప్రిల్ మొదటి వారం లోపు ఈ సినిమాకు సంబంధించిన అన్ని పనులు పూర్తి చెయ్యాలని ఆలోచిస్తున్నారు మేకర్స్.