Ram Charan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో 40 సంవత్సరాల పాటు మెగాస్టార్ గా వెలుగొందిన చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే చిరంజీవి తనయుడుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ప్రస్తుతం తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ సక్సెస్ లను సాధిస్తున్నాడు. ఒకప్పుడు చిరంజీవి చేసిన సూపర్ హిట్ సినిమాలైనా జగదేకవీరుడు అతిలోకసుందరి, ఘరానా మొగుడు, గ్యాంగ్ లీడర్ లాంటి సినిమాల్లో ఏదో ఒక సినిమాని రామ్ చరణ్ చేత రీమేక్ చేయించాలని స్టార్ ప్రొడ్యూసర్లందరూ ఎప్పటి నుంచో ఎదురు చేస్తున్నారు.
చిరంజీవి కూడా ఈ విషయం మీద స్పందిస్తూ ‘నేను చేసిన సినిమాల్లో ప్రతి సినిమా రీమేక్ చేసిన అవి రామ్ చరణ్ కి బాగా సెట్ అవుతాయి’ అంటూ ఒక ఇంటర్వ్యూలో తన అభిప్రాయాన్ని తెలియజేశాడు. ఇక రామ్ చరణ్ కూడా ఈ విషయం మీద స్పందిస్తూ మానాన్న (చిరంజీవి) సినిమాల్లో జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాని రీమేక్ చేయాలని అనుకుంటున్నాను అని తన మనసులో మాట ను బయట పెట్టడం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఆ తర్వాత ఈ విషయం మీద ఎవరు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. కానీ ఇప్పుడు పాన్ ఇండియాలో రామ్ చరణ్ సూపర్ సక్సెస్ అవ్వడంతో మరోసారి అశ్విని దత్ లాంటి స్టార్ ప్రొడ్యూసర్ ‘జగదేక వీరుడు అతిలోకసుందరి’ సినిమాని రామ్ చరణ్ చేత రీమేక్ చేయించాలని చూస్తున్నాడు.
అయితే ఈ ప్రాజెక్టుకి డైరెక్టర్ గా ఎవరిని తీసుకుంటారనే విషయాన్ని ఇంకా ఫైనల్ చేయలేదు. కానీ ఈ విషయం మీద చిరంజీవి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మరి రామ్ చరణ్ ప్రస్తుతం కమిట్ అయిన సినిమాలు పూర్తి చేసిన తర్వాత ఈ సినిమా ను తెరకెక్కించాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. చూడాలి మరి ఈ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తారు అనేది…ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ డైరెక్షన్ లో ‘గేమ్ చెంజార్’ అనే సినిమా చేస్తున్నాడు. అలాగే బుచ్చి బాబు తో ఒక సినిమా చేస్తు బిజీగా ఉన్నాడు…