Chiranjeevi Viswambhara: మెగాస్టార్ చిరంజీవి ఈసారి పాన్ ఇండియా మూవీతో వస్తున్నారు. యంగ్ డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో ఆయన చేస్తున్న విశ్వంభర మూవీ పలు భాషల్లో విడుదల కానుందని సమాచారం. బింబిసార మూవీతో వశిష్ఠ పరిశ్రమ దృష్టిని ఆకర్షించాడు. తన స్క్రిప్ట్ తో చిరంజీవిని ఇంప్రెస్ చేశాడు. విశ్వంభర షూటింగ్ మొదలవగా సెట్స్ లో హీరోయిన్ అడుగుపెట్టింది. చిరంజీవికి జంటగా కోలీవుడ్ బ్యూటీ త్రిష నటిస్తుంది. అధికారికంగా ఆమెను పరిచయం చేశారు.
నేడు త్రిష షూటింగ్ లో జాయిన్ అయ్యారు. చిరంజీవి స్వయంగా పూల గుచ్చం తో స్వాగతం పలికారు. చిరంజీవి-త్రిష కాంబోలో ఇది రెండో చిత్రం కావడం విశేషం. చిరంజీవి 2006లో స్టాలిన్ టైటిల్ తో సోషల్ సబ్జెక్టు తో ఒక చిత్రం చేశారు. ఈ చిత్రానికి మురుగదాస్ దర్శకుడు. స్టాలిన్ మూవీలో చిరంజీవికి జంటగా త్రిష నటించింది. దాదాపు 18 ఏళ్ల తర్వాత త్రిష మరోసారి చిరంజీవితో జతకడుతున్నారు. త్రిష ఎంట్రీతో కాంబో మీద అంచనాలు ఏర్పడ్డాయి.
విశ్వంభర మూవీలో మరో ఇద్దరు హీరోయిన్స్ ఉండే అవకాశం కలదని టాక్. జగదేక వీరుడిగా చిరంజీవి మూడు లోకాల్లో సంచరిస్తారని టాక్. త్రిష మెయిన్ లీడ్ హీరోయిన్ కాగవడంతో ఆమెను పరిచయం చేశారు. ఇక విశ్వంభర చిత్రం కోసం చిరంజీవి మేకోవర్ అవుతున్నారు. ఆయన స్లిమ్ అండ్ ఫిట్ గా కనిపించాలని చూస్తున్నారు. దీని కోసం గంటల తరబడి జిమ్ లో కఠిన వ్యాయామం చేస్తున్నారు. ఇటీవల ఆయన వ్యాయామం చేస్తున్న వీడియో విడుదల చేశారు.
విశ్వంభర మూవీలో చిరంజీవి లుక్ ఫ్యాన్స్ కి కిక్ ఇస్తుంది అనడంలో సందేహం లేదు. విశ్వంభర విడుదల తేదీ కూడా ప్రకటించేశారు. 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల చేయనున్నారు. విశ్వంభర చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. మరోవైపు చిరంజీవిని భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ చే గౌరవించింది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం చిరంజీవిని సత్కరించడం జరిగింది.
Welcome on board
The Gorgeous @trishtrashers ! #Vishwambhara pic.twitter.com/wqXUQF4gZH— Chiranjeevi Konidela (@KChiruTweets) February 5, 2024