Ram charan: రాంచరణ్ చెప్పే అదిరిపోయే శుభవార్త

Ram charan:మెగా పవర్ స్టార్ రాంచరణ్ కు సంబంధించిన ఒక శుభవార్త గురించి ఇప్పుడు సోషల్ మీడియా హోరెత్తుతోంది. మొన్ననే రాంచరణ్ కొన్న రెండున్నర కోట్ల బెంజ్ కారు వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దాని ధర, ఫీచర్లు గురించి తెలిసి అంతా అవాక్కయ్యారు. మెగా అభిమానులు అయితే పండుగ చేసుకున్నారు. తాజాగా రాంచరణ్ కు సంబంధించిన మరో విషయంలో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. రాంచరణ్ కొన్ని సంస్థలు, ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా […]

Written By: NARESH, Updated On : September 17, 2021 8:14 pm
Follow us on

Ram charan:మెగా పవర్ స్టార్ రాంచరణ్ కు సంబంధించిన ఒక శుభవార్త గురించి ఇప్పుడు సోషల్ మీడియా హోరెత్తుతోంది. మొన్ననే రాంచరణ్ కొన్న రెండున్నర కోట్ల బెంజ్ కారు వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దాని ధర, ఫీచర్లు గురించి తెలిసి అంతా అవాక్కయ్యారు. మెగా అభిమానులు అయితే పండుగ చేసుకున్నారు.

తాజాగా రాంచరణ్ కు సంబంధించిన మరో విషయంలో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. రాంచరణ్ కొన్ని సంస్థలు, ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. తాజాగా ఆ లిస్ట్ లోకి మరో సంస్థ వచ్చి చేరింది. రాంచరణ్ ప్రస్తుతం పెప్సీ, హ్యాపీ మొబైల్స్, ఎయిర్ టెల్ వంటి వాటికి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారు.

తాజాగా ఈ లిస్ట్ లో మరో సంస్థ చేరింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కు రాంచరణ్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉండబోతున్నాడనే వార్తలు వస్తున్నాయి. తాజాగా చెర్రి చేసిన పోస్ట్ ను బట్టి అదే నిజమని అర్థమవుతోంది.

రాంచరణ్ తాజాగా ఒక పోస్ట్ చేశారు. అందులో రాంచరణ్ కనిపించకుండా ఒక ఫోజు మాత్రం ఇచ్చాడు. ఈ మ్యాటర్ మాత్రం పరోక్షంగా హాట్ స్టార్ యాడ్ గురించేనని తెలుస్తోంది. ‘తెరమీదకు వినోద ప్రపంచాన్ని తీసుకొచ్చేందుకు అంతా సెట్ అయ్యింది. త్వరలోనే మీ ముందుకు అదిరిపోయే శుభవార్త రానుంది’ అని రాంచరణ్ చెప్పుకొచ్చారు. దీంతో ఈ శుభవార్త ఏంటనే దానిపై ఆసక్తి నెలకొంది. అది హాట్ స్టార్ యాడా? లేక మరేదైనా అన్న ఆసక్తి మెగాభిమానుల్లో పెరిగిపోయింది.

https://twitter.com/AlwaysRamCharan/status/1438793815830106116?s=20