Ram Charan Son Name: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan), ఉపాసన కొణిదెల(Upasana Konidela) దంపతులు రెండవ సారి తల్లిదండ్రులు అవ్వడం మెగా అభిమానులకు మామూలు ఆనందాన్ని ఇవ్వలేదు. ఇద్దరు కవలపిల్లలకు జన్మని ఇవ్వడం, అందులో ఒక బాబు ఉండడం వాళ్లకు పట్టరాని సంతోషాన్ని ఇచ్చింది. మెగా ఫ్యామిలీ లోని మూడవ తరం లో, ఒక్క వరుణ్ తేజ్ కి తప్ప మిగిలిన వాళ్లందరికీ ఆడపిల్లలే పుట్టారు. ముఖ్యంగా చిరంజీవి కుటుంబం మొత్తం ఆడ బిడ్డలే ఉన్నారు . ఒక్క కొడుకు పుడితే బాగుండును అని పలు సందర్భాల్లో చిరంజీవి కూడా చెప్పాడు. ఇక రామ్ చరణ్ ‘అన్ స్టాపబుల్’ షోలో పాల్గొన్నప్పుడు ఆయన తల్లి పంపిన స్పెషల్ వీడియో బైట్ లో కూడా రామ్ చరణ్ ని మగబిడ్డ కావాలని కోరుకుంటారు. అలా కుటుంబ సభ్యుల కోరిక నెరవేరినందుకు వాళ్లంతా ఎంత సంతోషం గా ఉన్నారో, అభిమానులు కూడా అంత సంతోషంతో సంబరాలు చేసుకుంటున్నారు.
ఇదంతా పక్కన పెడితే పుట్టిన ఈ ఇద్దరు కవలపిల్లలకు రామ్ చరణ్ ఎలాంటి పేరు పెట్టబోతున్నాడు అనేది ఇప్పుడు సోషల్ మీడియా లో జరుగుతున్న చర్చ. మెగా ఫ్యామిలీ లో పుట్టిన ప్రతీ బిడ్డకు ఆంజనేయ స్వామి పేరు , లేదా శ్రీ రాముడి పేరు కలిసొచ్చేలా పెట్టుకుంటూ వచ్చారు. కానీ మొట్టమొదటి సారి ఆంజనేయ స్వామి పేరు కలిసొచ్చేలా కాకుండా, రామ్ చరణ్ , ఉపాసన దంపతులు తమ మొదటి కూతురుకి ‘క్లిన్ కారా’ అనే పేరు పెట్టారు. అంటే లలిత సహస్రనామం నుండి తీసుకోబడిన పేరు ఇది. ఇప్పుడు పుట్టిన తన ఇద్దరు పిల్లలకు కూడా అలాంటి పేరే పెట్టబోతున్నారా..?, లేకపోతే ఆంజనేయ స్వామి పేరు కలిసొచ్చేలా పెడుతారా? అనేది ఇప్పుడు ఆసక్తికరమైన అంశం. ముఖ్యంగా కొడుకుకి ఎవరు పేరు పెట్టబోతున్నారు అనే విషయం పై సోషల్ మీడియా లో పెద్ద చర్చ నడుస్తుంది.
పవన్ కళ్యాణ్ తన చిన్న కొడుక్కి తన అన్నయ్య చిరంజీవి, తన పేరు కలిసొచ్చేలా మార్క్ శంకర్ పవోనోవిచ్ అని పేరు పెట్టాడు. రామ్ చరణ్ కూడా ఆ తరహా తన తండ్రి, బాబాయి పేరు కలిసొచ్చేలా తన కొడుక్కి పేరు పెడుతాడా? అని మాట్లాడుకుంటున్నారు నెటిజెన్స్. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. మరి ఏమి పేరు పెట్టబోతున్నాడో చూడాలి. ఓజీ చిత్రం నుండి మెగా ఫ్యామిలీ కి అన్ని శుభాలే జరుగుతున్నాయి. ఓజీ చిత్రం పెద్ద హిట్ అవ్వడం, ఆ తర్వాత వచ్చిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ కూడా హిట్ అవ్వడం, ఇదే నెలలో రామ్ చరణ్ కి కవలపిల్లలు పుట్టడం వంటివి జరిగాయి. ఇక రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’, రామ్ చరణ్ ‘పెద్ది’ చిత్రాలు కూడా భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ కానున్నాయి.