అక్కినేని సమంతకి కొన్ని బ్రాండ్స్ అంటే ఎంతో ఇష్టం అట. నిజానికి దేశీ చేనేతకు తానే ఒక బ్రాండ్ అని ఎనౌన్స్ చేసిన సామ్, ఇంటర్నేషనల్ బ్రాండ్స్ మీద ఇష్టాన్ని మాత్రం వదులుకోలేకపోతుంది. పై ఫొటోలో సమంత ధరించిన వస్తువులు అలాగే డ్రెస్ కూడా ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కు సంబంధించినవే. మరి ఆ బ్రాండ్స్ గురించి పూర్తి డిటైల్స్ ను సామ్ నే చెప్పుకొచ్చింది.
లూయి విట్టోన్ బై మెటీరియల్ డ్రస్ దీని ధర: రూ. 2,01,773/- సామాన్యులు ఈ డ్రెస్ కొనుక్కుని వేసుకోవడం అంటే కష్టమే. సన్ లోరాన్ ట్రిబ్యుట్ ఫ్లాట్‌ఫాం శాండిల్స్ వీటి ధర: రూ. 85,000/-. అసలు శాండిల్స్ కాస్ట్ ఇంత ఉంటుందా అని షాక్ అవ్వాలి. లూయి చైన్ బ్యాగ్, దీని ధర: రూ. 15,600/- ఏమిటి ఆ చిన్న బ్యాగ్ ఖరీదు అంతా ? ఏముంటుంది దానిలో అని నెటిజన్లు బ్లాంక్ ఫేస్ పెడుతున్నారు గానీ, సామ్ కి ఆ బ్యాగ్ అంటే చాల ఇష్టం అట.
అయినా బ్రాండ్స్ వాల్యూ తెలియాలంటే.. వాటిని వాడి చూడాలి. బ్రాండ్ అనేది అంత ఈజీగా దేనికి రాదు కదా. అందుకే లూయి విట్టోన్ బ్యాగ్ పై సమంతకు చిన్నప్పటి నుండే మోజు ఉండేది అట. ఈ విషయం గురించి సామ్ మాట్లాడుతూ.. ‘నేను టీనేజ్‌లో ఉన్నప్పుడు లూయి విట్టోన్ బ్యాగ్ కొనుక్కోవాలని ఎంతగానే మనసుపడ్డాను. కానీ ఆ బుజ్జి బ్యాగ్ ధర ఎంతో తెలుసా? ముప్పై వేల రూపాయిలు ఓన్లీ. ఆ కాలాన్ని ఫాస్ట్ ఫార్వడ్ చేస్తే అది ఇప్పటికీ నా ఫేవరేట్’ అంటూ అప్పటి రోజుల్లోకి వెళ్లిపోయి చెప్పుకొచ్చింది సమంతా.
సమంత మెచ్చిన లూయి విట్టోన్ ప్రముఖ అంతర్జాతీయ ఫ్యాషన్ హౌస్ లలోనే ఒకటిగా ఉంది. 1854లో ఫ్రాన్స్‌కు చెందిన విట్టోన్ అనే వ్యక్తి దీన్ని స్థాపించి ఈ బ్రాండ్ కు ఒక విలువ తీసుకు వచ్చాడు. లెదర్ క్వాలిటీ, డిజైన్స్ ప్రత్యేకతతో వరల్డ్‌లోనే అతి పెద్ద ఫ్యాషన్ బ్రాండ్ గా ఇది రూపొందింది కాబట్టే సమంత ఈ బ్రాండ్ ను ఇష్టపడింది.