https://oktelugu.com/

Ram Charan: రామ్ చరణ్ ఫాన్స్ కి ఊహించని షాక్ ఇవ్వబోతున్న కొరటాల శివ

Ram Charan: మెగాస్టార్ చిరంజీవి – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కిన ఆచార్య సినిమా ఈ నెల 29 వ తారీఖున ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా విడుదల కాబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఇందులో చిరంజీవి కి జోడిగా కాజల్ అగర్వాల్ మరియు రామ్ చరణ్ కి జోడిగా పూజ హెగ్డే హీరోయిన్లు గా నటిస్తుండగా, మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు..భారీ అంచనాలు ఏర్పర్చుకున్న […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 17, 2022 / 06:42 PM IST
    Follow us on

    Ram Charan: మెగాస్టార్ చిరంజీవి – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కిన ఆచార్య సినిమా ఈ నెల 29 వ తారీఖున ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా విడుదల కాబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఇందులో చిరంజీవి కి జోడిగా కాజల్ అగర్వాల్ మరియు రామ్ చరణ్ కి జోడిగా పూజ హెగ్డే హీరోయిన్లు గా నటిస్తుండగా, మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు..భారీ అంచనాలు ఏర్పర్చుకున్న ఈ సినిమా గురించి సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న ఒక్క వార్త రామ్ చరణ్ అభిమానులను కలవరపరుస్తోంది..అదేమిటి అంటే ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్ర కేవలం 25 నిమిషాలు మాత్రమే ఉంటుంది అనే సంగతి మన అందరికి తెలిసిందే..ఇప్పుడు ఈ పాత్ర నిడివి మరింత తగ్గించారు అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త .

    Ram Charan

    ఇటీవల విడుదల అవుతున్న సినిమాలు అన్నిటికి రన్ టైం విషయం లో దర్శకులు చాలా కేర్ తీసుకుంటున్నారు..రీసెంట్ గా విడుదల అయిన పుష్ప,#RRR మరియు KGF చాప్టర్ 2 వంటి సినిమాల రన్ టైం దాదాపుగా మూడు గంటల వరుకు ఉంటుంది..అంత లెంగ్త్ ఉన్నప్పటికీ కూడా స్క్రీన్ ప్లే ఉత్కంఠభరితంగా ఉండడం తో ఈ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయాలుగా నిలిచాయి..కానీ అన్ని సినిమాలకు ఇదే ఫార్ములా వర్కౌట్ అవ్వదు..కొన్ని సినిమాలు అనవసరమైన సన్నివేశాలు ఎడిటింగ్ లో తొలగించకపోవడం వల్ల బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయం పాలైనవి కూడా చాలానే ఉన్నాయి..సినిమా మొత్తం తియ్యడం ఒక్క ఎత్తు అయితే,ఎడిటింగ్ చెయ్యడం మరొక్క ఎత్తు..ఇక్కడ జాగ్రత్తలు తీసుకోకపోతే సినిమాలు బోల్తా కొట్టే అవకాశాలు మెండుగా ఉంటాయి..అందుకే కొరటాల శివ కూడా ఆచార్య రన్ టైం విషయం లో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు..ఈ సినిమాలో రామ్ చరణ్ ఫ్లాష్ బ్యాక్ లో అనవసరం అనిపించినా కొన్ని సన్నివేశాలు తీసిన తర్వాత మూవీ అవుట్ ఫుట్ అదిరిపోయింది అనే టాక్ వినిపిస్తుంది.

    Also Read: Pawan Kalyan New Movie: KGF డైరెక్టర్ తో పవన్ కళ్యాణ్ కొత్త సినిమా.. సంబరాల్లో ఫాన్స్

    Ram Charan

    మరి తమ హీరో పాత్ర కేవలం 25 నిమిషాలేనా అని ఫీల్ అవుతున్న రామ్ చరణ్ ఫాన్స్..ఇప్పుడు ఆయన పాత్రని మరింత తగ్గిస్తే వాళ్ళు ఎలా తీసుకుంటారో అని ఈ సినిమాని కొన్న బయ్యర్లు భయపడుతున్నారు అట..కానీ రామ్ చరణ్ కనిపించేది తక్కువసేపు అయిన కూడా ఆయన పాత్రని ఎంతో పవర్ ఫుల్ గా ఉంటుంది అని..సినిమాని చూసే అభిమానులకు రామ్ చరణ్ పాత్ర తగ్గింది అనే భావన అసలు రాదు అని మూవీ మేకర్స్ ధైర్యం చెప్తున్నారు..ముఖ్యంగా చిరంజీవి మరియు రామ్ చరణ్ మధ్య వచ్చే సన్నివేశాలు అన్నీ కూడా అభిమానులకు ఫీస్ట్ గా ఉండబోతుంది అని సమాచారం..అంతే కాకుండా ఇటీవలే ఈ సినిమా మొదటి కాపీ ని కొంతమంది ఇండస్ట్రీ ప్రముఖులకు చూపించారు అట..ఈ ప్రివ్యూ ని చూసిన ప్రతి ఒక్కరు సెకండ్ హాఫ్ అదిరిపోయింది అంటూ కొరటాల శివ ని పొగడ్తలతో ముంచి ఎత్తారు అని వినికిడి..మరి ప్రేక్షకులు కూడా ఈ సినిమా చూసి అదే స్థాయిలో మెచ్చుకుంటారా లేదా అనేది తెలియాలి అంటే మరో పది రోజులు వేచి చూడాల్సిందే.

    Also Read:SS Rajamouli: మహేష్ తో నేను అలాంటి రిస్క్ చెయ్యలేను

    Tags