https://oktelugu.com/

Pawan Kalyan New Movie: KGF డైరెక్టర్ తో పవన్ కళ్యాణ్ కొత్త సినిమా.. సంబరాల్లో ఫాన్స్

Pawan Kalyan New Movie: టాలీవుడ్ లో ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఊపు ఏ స్థాయిలో ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..2018 వ సంవత్సరం లో విడుదల అయిన అజ్ఞాతవాసి సినిమా తర్వాత ఆయన చేస్తున్న మూడేళ్ళ సుదీర్ఘ విరామం తీసుకొని ఆయన చేసిన వకీల్ సాబ్ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..కరోనా సెకండ్ వేవ్ విలయ తాండవం ఆడుతున్న సమయం లో కూడా ఈ సినిమా […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 17, 2022 / 06:26 PM IST
    Follow us on

    Pawan Kalyan New Movie: టాలీవుడ్ లో ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఊపు ఏ స్థాయిలో ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..2018 వ సంవత్సరం లో విడుదల అయిన అజ్ఞాతవాసి సినిమా తర్వాత ఆయన చేస్తున్న మూడేళ్ళ సుదీర్ఘ విరామం తీసుకొని ఆయన చేసిన వకీల్ సాబ్ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..కరోనా సెకండ్ వేవ్ విలయ తాండవం ఆడుతున్న సమయం లో కూడా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఘన విజయం సాధించి పవన్ కళ్యాణ్ స్టామినా ఎలాంటిదో మరోసారి అందరికి అర్థం అయ్యేలా చేసింది..ఈ సినిమా తర్వాత ఆయన చేసిన భీమ్లా నాయక్ సినిమా కూడా అతి తక్కువ టికెట్ రేట్స్ తో విడుదల అయ్యి 100 కోట్ల రూపాయిల షేర్ ని కొల్లగొట్టి సరికొత్త ప్రభంజనం సృష్టించింది..ఇప్పుడు ఆయన ప్రముఖ దర్శకుడు క్రిష్ తో హరిహర వీర మల్లు సినిమా చేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సినిమా పూర్తి అయిన తర్వాత ఆయన గబ్బర్ సింగ్ సినిమా దర్శకుడు హరీష్ శంకర్ తో ఒక్క భవదీయుడు భగత్ సింగ్ అనే సినిమా చెయ్యబోతున్నాడు..ఈ రెండు సినిమాల తర్వాత ఆయన చెయ్యబొయ్యే సినిమాల మీద ఇప్పుడు సోషల్ మీడియా లో పెద్ద చర్చ నడుస్తుంది.

    Pawan Kalyan New Movie

    ఇక అసలు విషయానికి వస్తే KGF సిరీస్ వంటి సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందించిన హోమబుల్ సంస్థ త్వరలో పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా చెయ్యడానికి ఆయనతో ఇటీవలే చర్చలు జరిపినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి..ఈ సినిమా 2024 వ సంవత్సరం లో ఉంటుంది అట..ఈ సినిమాకి KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించబోతున్నాడు అని తెలుస్తుంది..KGF సిరీస్ తో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన ప్రశాంత్ నీల్ తో పవన్ కళ్యాణ్ లాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో సినిమా చెయ్యబోతున్నాడు అంటే అభిమానుల్లో ఎలాంటి అంచనాలు ఏర్పడతాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ప్రశాంత్ నీల్ రాసే ఎలేవేషన్ సన్నివేశాలలో పవన్ కళ్యాణ్ ని ఊహించుకుంటేనే రోమాలు నిక్కపొడుస్తాయి..అలాంటిది వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చే సినిమాని వెండితెర మీద చూస్తే అభిమానులు మరియు ప్రేక్షకుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడానికి కూడా సాధ్యపడదు..ఈ క్రేజీ కాంబినేషన్ గురించి మరిన్ని వివరాలు తెలియాలి అంటే కొద్దీ రోజులు ఆగాల్సిందే.

    Also Read: SS Rajamouli: మహేష్ తో నేను అలాంటి రిస్క్ చెయ్యలేను

    Pavan Kalyan

    ప్రశాంత్ నీల్ KGF చాప్టర్ 2 సినిమా తర్వాత ప్రభాస్ తో సలార్ సినిమా చేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సినిమా షూటింగ్ ఇప్పటి వరుకు 30 శాతం పూర్తి అయ్యింది అట..ఈ సినిమా తర్వాత ఆయన యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఒక్క సినిమా చేయనున్నాడు..ఈ రెండు సినిమాలు పూర్తి అయిన తర్వాత ఆయన కన్నడ హీరో శ్రీమురళి తో ఒక్క సినిమా చేయబోతున్నాను అని ఇటీవలే జరిగిన ఒక్క ఇంటర్వ్యూ లో తెలిపాడు..ఈ ప్రాజెక్ట్స్ అన్ని పూర్తి అయిన తర్వాతనే పవన్ కళ్యాణ్ తో సినిమా ఉంటుంది అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త..ఇక పవన్ కళ్యాణ్ కూడా ప్రస్తుతం తన చేతిలో ఉన్న హరిహర వీరమల్లు మరియు భవదీయుడు భగత్ సింగ్ సినిమాలు పూర్తి చేసుకొని 2024 సార్వత్రిక ఎన్నికల కోసం ప్రజాక్షేత్రం లోకి అడుగుపెట్టబోతున్నాడు..2024 వ సంవత్సరం తర్వాత ఆయనకి సమయం కుదిరినప్పుడు ఈ సినిమా చేయనున్నాడు అని తెలుస్తుంది.

    Also Read:Prabhas: RRR మూవీ చూసి ఘోరంగా ఏడ్చేసాను

    Tags