Ram Charan : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) మరో ప్రతిష్టాత్మక బ్రాండ్ కి అంబాసిడర్ గా మారిపోయాడు. 1970 , 80 దశకాల్లో ‘కంపా కోలా'(Campa Cola) ఎంతో ప్రాచుర్యం చెందింది. ఆరోజుల్లో కూల్ డ్రింక్ అంటే ఇదే. కానీ మధ్యలో కొన్నాళ్ళు నష్టాలు రావడంతో ఆపేయాల్సి వచ్చింది. ఈ సంస్థని రీసెంట్ గానే రిలయన్స్ వాళ్ళు కొనుగోలు చేశారు. 2023 వ సంవత్సరం లో ఈ బ్రాండ్ ని మార్కెట్ లోకి తీసుకొని వచ్చారు. మార్కెట్ లోకి వచ్చిన ఏడాదిలోపే ఈ బ్రాండ్ వెయ్యి కోట్ల రూపాయిల లాభాలను ఆర్జించింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్రాండ్ కూల్ డ్రింక్స్ కంపెనీలలో ఫాస్టెస్ట్ వెయ్యి కోట్ల లాభాలను తెచ్చిపెట్టిన బ్రాండ్ గా కంపా కోలా కి మంచి పేరొచ్చింది. 2024 వ సంవత్సరం లో దీని లాభాలు 1800 కోట్ల రూపాయిల వరకు ఉంటుందని అంచనా.
Also Read : కమెడియన్ సత్య కాళ్ళు పట్టుకోబోయిన రామ్ చరణ్..వీడియో వైరల్!
అలా మార్కెట్ లో ఒక రేంజ్ లో ట్రెండింగ్ అవుతున్న ఈ బ్రాండ్ కి రామ్ చరణ్ అంబాసిద్దర్ గా వ్యవరించబోతున్నారు. నిన్న రిలయన్స్ సంస్థ ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అధికారికంగా గ్రాండ్ గా ప్రకటించింది. రామ్ చరణ్ తో చేతులు కలపడం మా బ్రాండ్ కి మరింత శోభని తెచ్చిపెట్టింది అంటూ రిలయన్స్ సంస్థ వేసిన ఒక ట్వీట్ బాగా వైరల్ అయ్యింది. ‘కంపా కోలా’ మిగిలిన బ్రాండ్స్ లాంటిది కాదు. ఈ కూల్ డ్రింక్ లో షుగర్ ఉండదట. ఎంతో ఆరోగ్యవంతమైన డ్రింక్ అని ఇప్పటి వరకు ఈ బ్రాండ్ ని రుచి చూసిన వాళ్ళు చెప్తున్న మాట. మొదటి రెండు సంవత్సరాల లోనే భారీ లాభాలను మూటగట్టుకున్న ఈ బ్రాండ్, రాబోయే రోజుల్లో ఏ రేంజ్ లాభాలను చూడబోతుందో చూడాలి. ఇకపోతే కంపా కోలా కి సంబంధించిన సరికొత్త యాడ్ ని కూడా నిన్ననే విడుదల చేశారు.
‘పెద్ది’ గ్లింప్స్ వీడియో లో రామ్ చరణ్ లుక్ ఎలా అయితే ఉన్నిందో, ఈ యాడ్ లో కూడా అదే లుక్ తో కనిపించాడు. అభిమానులు రామ్ చరణ్ ని ఇంతటి ప్రతిష్టాత్మకమైన బ్రాండ్ కి అంబాసిడర్ గా వ్యవహరించడాన్ని ఎంతో గర్వంగా భావిస్తున్నారు. ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే, డైరెక్టర్ బుచ్చి బాబు తో కలిసి ఆయన చేస్తున్న ‘పెద్ది'(Peddi Movie) చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ వీడియో ఏ రేంజ్ లో ఉన్నిందో మీరంతా చూసే ఉంటారు. గ్రామీణ నేపథ్యం లో తెరకెక్కుతున్న ఈ స్పోర్ట్స్ డ్రామా పై అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఇప్పటికే మూడు షెడ్యూల్స్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం, అతి త్వరలోనే నాల్గవ షెడ్యూల్ ని కూడా ప్రారంభించుకోనుంది. వచ్చే ఏడాది మార్చి 27 న రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాని విడుదల చేయబోతున్నారు.
Also Read : రామ్ చరణ్ మీద హాట్ కామెంట్స్ చేసిన ఉపాసన…