Ram Charan : RRR వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సౌత్ ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తో ‘గేమ్ చేంజర్’ అనే చిత్రాన్ని ప్రారంభించిన సంగతి అందరికీ తెలిసిందే. ఏ ముహూర్తం లో ఈ సినిమాని ప్రారంభించారో తెలియదు కానీ, ప్రారంభించినప్పటి నుండి అన్ని అడ్డంకులే. #RRR మూవీ షూటింగ్ అయిపోయిన వెంటనే రామ్ చరణ్ ఈ చిత్రానికి డేట్స్ కేటాయించాడు. షూటింగ్ ప్రారంభం లో స్పీడ్ గానే జరిగేది. కానీ మధ్యలో శంకర్ ‘ఇండియన్ 2 ‘ చిత్రం చేయాల్సి వచ్చింది. దీంతో నెలలో 15 రోజులు ‘గేమ్ చేంజర్’ చిత్రానికి ఆయన డేట్స్ కేటాయిస్తే, మిగిలిన 15 రోజులు ‘ఇండియన్ 2 ‘ కి కేటాయించేవాడు. అలా ముందుగా ఇండియన్ 2 చిత్రాన్ని పూర్తి చేసి విడుదల చేసాడు.
ఆ సినిమా ఫలితం అందరికీ తెలిసిందే. ఈ చిత్రం ఫ్లాప్ తర్వాత శంకర్ ‘గేమ్ చేంజర్’ చిత్రం లో చిన్న చిన్న మార్పులు చేయాలని అనుకున్నాడు. కొన్ని సన్నివేశాలు ఎందుకో ఆయనకు ఇంకా బాగా తియ్యాలని అనిపించిందట. రీ షూట్స్ కోసం రామ్ చరణ్ డేట్స్ ని ఇటీవలే అడిగాడట శంకర్. రామ్ చరణ్ పాత్రకు సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తి అయ్యి రెండు నెలలు అయ్యింది. ఆయన బుచ్చి బాబు సినిమా షూటింగ్ కోసం సిద్ధం అవుతున్నాడు. లుక్స్ కూడా పూర్తిగా మార్చేశాడు. అక్టోబర్ నుండి ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లేందుకు సిద్ధంగా ఉంది. ఇలాంటి సమయం లో లుక్స్ మరోసారి మార్చి, గేమ్ చేంజర్ రీ షూట్స్ కోసం డేట్స్ ఇవ్వడం అసాధ్యమైన పని, అందుకే శంకర్ రిక్వెస్ట్ ని చాలా సున్నితంగా తిరస్కరించాడట రామ్ చరణ్. ఉన్న కంటెంట్ తోనే సర్దుకోండి, వాటి వల్ల సినిమా ఫ్లో కి అడ్డం అనిపిస్తే ఎడిటింగ్ లో తొలగించుకోండి అని చెప్పాడట.
దీంతో శంకర్ కాస్త నిరాశకు గురైనట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది. వినాయక చవితి రోజు ఈ సినిమాకి సంబంధించిన కొత్త పోస్టర్ ని విడుదల చేసింది మూవీ టీం. ఆ టీం కి సంబంధించిన వాళ్ళందరూ ఈ వార్త ని ఎంతో ఆనందం గా అభిమానులతో షేర్ చేసుకుంటే, శంకర్ మాత్రం చాలా నీరసంగా, ఇష్టం లేకపోయినా బలవంతంగా ట్వీట్ వేస్తున్నట్టుగా వేసాడు. అప్పుడే అందరికీ అనుమానం వచ్చింది, కచ్చితంగా రామ్ చరణ్, శంకర్ కి మధ్య చిన్న గ్యాప్ ఏర్పడింది అని. ఇప్పుడు సోషల్ మీడియా లో విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న ఈ వార్త ని చూస్తుంటే అది నిజమేనేమో అని అనిపిస్తుంది. ఇది ఇలా ఉండగా రేపు ఈ సినిమాకి సంబంధించిన రెండవ పాట అప్డేట్ ని ఇవ్వబోతుంది మూవీ టీం. ఇప్పటికే మొదటి లిరికల్ వీడియో సాంగ్ కి ఆడియన్స్ నుండి బంపర్ రెస్పాన్స్ వచ్చింది. రేపటి నుండి డిసెంబర్ 20 వరకు నాన్ స్టాప్ అప్డేట్స్ ఉంటాయని ఆ చిత్ర సంగీత దర్శకుడు థమన్ చెప్పుకొచ్చాడు.