https://oktelugu.com/

YouTuber Harsha Sai : ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి పై యువతి సంచలన ఆరోపణలు..కేసు నమోదు చేసిన పోలీసులు!

కాసేపటి క్రితమే ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి మీద ఒక యువతి సంచలన ఆరోపణలు చేస్తూ పోలీస్ కేసు నమోదు చేసింది. హర్ష సాయి తనతో ప్రేమాయణం నడిపి పెళ్లి పేరుతో మోసం చేసాడని, తన దగ్గర రెండు కోట్ల రూపాయిలు కూడా తీసుకున్నాడని ఆ యువతి హైదరాబాద్ లోని నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

Written By:
  • Vicky
  • , Updated On : September 24, 2024 / 09:53 PM IST

    YouTuber Harsha Sai

    Follow us on

    YouTuber Harsha Sai : సినీ ఇండస్ట్రీ లో అమ్మాయిలపై లైంగిక దాడులు జరగడం కొత్తేమి కాదు. ఇది ప్రతీ ఇండస్ట్రీ లో ఉన్నదే. కానీ బయటకి వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇస్తే తమ జీవితాలు ఏమి అవుతాయో అనే భయం చాలా మంది అమ్మాయిలు సర్దుకుపోతుంటారు ఇండస్ట్రీ లో. కానీ రీసెంట్ జానీ మాస్టర్ పై శ్రేష్టి వర్మ అనే అమ్మాయి లైంగిక వేధింపులు చేస్తున్నాడంటూ నార్సింగి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వగా, జానీ మాస్టర్ ని పోలీసులు అరెస్ట్ చేసి, కోర్టు లో హాజరుపరిచి, చంచల్ గూడా జైలుకు రిమాండ్ కోసం తరలించారు. జానీ మాస్టర్ స్థాయి వ్యక్తికే కఠిన శిక్ష పడే అవకాశాలు కనిపించడం తో ఇండస్ట్రీ లో ఇప్పుడు ఒక్కొక్కరుగా ధైర్యంగా ముందుకు అడుగులు వేస్తున్నారు. కాసేపటి క్రితమే ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి మీద ఒక యువతి సంచలన ఆరోపణలు చేస్తూ పోలీస్ కేసు నమోదు చేసింది. హర్ష సాయి తనతో ప్రేమాయణం నడిపి పెళ్లి పేరుతో మోసం చేసాడని, తన దగ్గర రెండు కోట్ల రూపాయిలు కూడా తీసుకున్నాడని ఆ యువతి హైదరాబాద్ లోని నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

    హర్ష సాయి కి అతని తండ్రి సహకారం కూడా ఉందని, అతనే దగ్గరుండి ఇవ్వనీ చేయిస్తున్నాడని హర్ష సాయి తండ్రి పై కూడా ఆమె కంప్లైంట్ ఇచ్చింది. దీంతో ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చిన హర్ష సాయి యూట్యూబ్ ద్వారా కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమయ్యాడు. ఇతను తన ఛానల్ లో అప్లోడ్ చేసే యూట్యూబ్ కంటెంట్ కి విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ప్రతి వీడియో కి మిలియన్ల కొద్ది లైక్స్, వ్యూస్ వస్తుంటాయి. యూట్యూబ్ ద్వారా ఇంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న యూట్యూబర్ మరొకరు లేరు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

    దాదాపుగా కోటి మంది సబ్ స్క్రైబర్స్ ఈయన యూట్యూబ్ ఛానల్ కి ఉన్నారు. తాను సంపాదించిన డబ్బులను పేదలకు చారిటీ చేస్తూ కూడా ఇతను ఎన్నో వీడియోలు చేసాడు. యూట్యూబ్ ద్వారా ఇతను సంపాదించిన క్రేజ్ తో ఒక సినిమాలో హీరో గా చేసే అవకాశం కూడా వచ్చింది. ఆ చిత్రం పేరు ‘మెగా’. ఏడాది క్రితం ఈ సినిమాని ప్రారంభించి, కొంత భాగం షూటింగ్ చేసి టీజర్ ని కూడా విడుదల చేసారు. ఈ టీజర్ కి 12 మిలియన్ వ్యూస్ కూడా వచ్చాయి. అయితే ఈ సినిమా ఆ తర్వాత ఏమైందో ఎవరికీ తెలియదు. ఇది కాసేపు పక్కన పెడితే యువరత్న అనే వ్యక్తి గత కొంతకాలంగా హర్ష సాయి చారిటీ మీద చేస్తున్న స్కామ్స్ ని బయటపెడుతూ అనేక డిబేట్స్ లో పాల్గొన్నాడు. ఈ ఘటన ని మరిచిపోకముందే ఇప్పుడు ఈ యువతి హర్ష సాయి మీద కేసు నమోదు చేయడం చర్చనీయాంశం అయ్యింది.