Deputy CM Pawan Kalyan : ఒక పక్క సినిమా షూటింగ్ లో బిజీ గా ఉంటూ, మరోపక్క ఉప ముఖ్యమంత్రిగా తన పాలనా బాధ్యతలను నిర్వహిస్తూ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ఎంత బిజీ గా ఉంటున్నాడో మనమంతా చూస్తూనే ఉన్నాం. నిన్న సాయంత్రం ఆయన ఒక కుర్రాడితో కలిసి బ్యాటరీ సైకిల్ ని తొక్కుతూ తన ఆనందాన్ని వ్యక్తం చేసాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లాకు చెందిన రాజాపు సిద్ధూని పవన్ కళ్యాణ్ నిన్న మంగళగిరి పార్టీ ఆఫీస్ కి పిలిపించుకొని అభినందించాడు. సిద్దు తన దగ్గర ఉన్న సాధారణ వ్యయం తో, తన మేధస్సు కి పదును పెడుతూ బ్యాటరీ తో నడిచే ఒక సైకిల్ ని రూపొందించాడు. సిద్దు చేసిన ఈ విన్నూతన ప్రయత్నం సోషల్ మీడియా ద్వారా బాగా వైరల్ అయ్యి పవన్ కళ్యాణ్ వరకు చేరడం తో ఆయన్ని తన క్యాంపు ఆఫీస్ కి పిలిపించుకొని సిద్దు రూపొందించిన ఈ సైకిల్ ని స్వయంగా పరిశీలించాడు పవన్ కళ్యాణ్.
https://x.com/venupro/status/1942966613537599532
సిద్దు విజయనగరం జిల్లాలోని, జాడవారి కొత్త వలస గ్రామంలోని ఒక కాలేజీ లో చదువుకుంటున్నాడు. తన కాలేజ్ కి వెళ్ళడానికి ప్రతీ రోజు చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేది. తన ఇబ్బందికి పరిష్కారం స్వయంగా తానే కనిపెడుతూ ఈ ఎలక్ట్రిక్ సైకిల్ ని తయారు చేశాడు. ఈ సైకిల్ ని మూడు గంటలు ఛార్జ్ చేస్తే చాలు, 80 కిలోమీటర్ల వరకు ప్రయాణం చెయ్యొచ్చు అంట. ఇంత చిన్న వయస్సులో ఈ రేంజ్ ఆలోచన చేయడం సాధారణమైన విషయం కాదు కదా?, అందుకే ఆ కుర్రాడి టాలెంట్ ని గుర్తించి పవన్ కళ్యాణ్ లక్ష రూపాయిల సాయం అందించాడు. అంతే కాదు సిద్దు పవన్ కళ్యాణ్ తో పంచుకున్న కొన్ని ఆలోచనలు చూసి ఆశ్చర్యపోయాడట. కేవలం ఎలెక్ట్రిక్ సైకిల్ ని మాత్రమే కాదు. సిద్దులు గ్రాసరీ గురువు వాట్సాప్ సర్వీస్ బ్రోచర్ ని కూడా రూపొందించాడట. దీనిని చూసి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా అభినందించాడు.
Also Read: రాజమౌళి – పూరి జగన్నాధ్ ఇండస్ట్రీ కి రాక ముందు నుంచే ఫ్రెండ్సా..? సంచలన విషయం చెప్పిన పూరి…
సిద్దు చదువుకు ఎలాంటి ఆటంకంగా కలగకుండా ఉండేలా చూసుకోవాలని, ఇలాంటి యంగ్ టాలెంట్ ని ప్రోత్సహించాలని, అతనికి ఇలాంటి ఆలోచనలు చాలా ఉన్నాయని, వాటికి అవసరమయ్యే విద్య సమకూర్చాలని పవన్ కళ్యాణ్ అధికారులకు ఆదేశించాడు. పవన్ కళ్యాణ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగానికి కూడా ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు ఆయన కేవలం పంచాయితీ రాజ్, అటవీ శాఖ, పర్యావరణం శాఖలపైనే ఎక్కువగా ద్రుష్టి సారించాడు కానీ, సైన్స్ & టెక్నాలజీ శాఖ మీద పెద్దగా ద్రుష్టి సారించలేదు. సిద్దు లాంటి తెలివైన వాళ్ళు మన రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు. వాళ్ళ ప్రతిభ ని పవన్ కళ్యాణ్ ఎదో ఒక కార్యక్రమం ద్వారా బయట పెడితే బాగుంటుంది అని అభిమానులు కోరుకుంటున్నారు.