Ram Charan RC 15: కొద్ది రోజుల క్రితం వరకు రామ్ చరణ్ – శంకర్ సినిమా అన్నది టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ. ఈ ప్రాజెక్టు మీద చాలా గ్యాసిప్ లు పుట్టాయి. కానీ వాటన్నింటికి ఫుల్ స్టాప్ పెడుతూ మేకర్స్ ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తూనే ఉన్నారు. అదేంటో అనౌన్స్ మెంట్ వచ్చిన దగ్గర నుంచి, ఈ సినిమా పుకార్ల అంకం మాత్రం ముగియడం లేదు. తాజాగా ఇప్పుడు ఇండస్ట్రీ లో ఈ సినిమా గురించి కొత్త డిస్కషన్ పాయింట్ వైరల్ అవుతుంది. ఈ సినిమా కోసం రామ్ చరణ్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడు ?.

నిజానికి చరణ్ రెమ్యూనరేషన్ ఎంత ? అంటే.. చరణ్ రెమ్యూనరేషన్ ఇంత అంటూ రకరకాల ఫిగర్లు వినిపిస్తున్నాయి. కానీ వాటిల్లో నిజం లేదు. మెగా సన్నిహితుల గుసగుసల ప్రకారం.. చరణ్ రెమ్యూనరేషన్ 65 కోట్లు అని పక్కాగా వినిపిస్తోంది. కాదు 72 కోట్లు పైగానే అని కూడా వినిపిస్తోంది. అసలు ఇప్పటి వరకు శంకర్ సినిమాకు సంబంధించి.. చరణ్ తో దిల్ రాజుకి రెమ్యూనరేషన్ డిస్కషన్ నే జరగలేదనీ అంటున్నారు.
సినిమా లాభాల్లో వాటా అంటూ దిల్ రాజు, చరణ్ కి ప్రపోజల్ పెట్టాడని.. కాబట్టి చరణ్ కూడా తన రెమ్యునరేషన్ గురించి పెద్దగా ఆలోచించలేదు అని టాక్ నడుస్తోంది. గతంలో రామ్ చరణ్ రెమ్యూనరేషన్ మాత్రం 35…45…47 ఇలా వుంటూ వచ్చింది. ఈ సారి 70 కి కాస్త ఇటు అటుగా వుంటుందని అంటున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ కి పాన్ ఇండియా వైడ్ గా మార్కెట్ క్రియేట్ అయిందని, కాబట్టి, చరణ్ 70 కోట్లు ఇచ్చినా పొరపాటు అవ్వదు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

పైగా ఇండస్ట్రీలో ఇప్పుడు రెమ్యూనరేషన్లు బాగా పెరిగాయి. అందువల్ల చరణ్ రెమ్యూనరేషన్ కూడా 70 కోట్ల పైమాట అనడంలో డౌట్ అక్కర్లేదు. కానీ, ఇక్కడ ఒక సమస్య ఉంది. చరణ్ కే 70 కోట్లు ఇస్తే, ఇక శంకర్ కి ఎంత ఇవ్వాలి ?. శంకర్ పాన్ ఇండియా డైరెక్టర్. కాబట్టి.. శంకర్ కు 35 కోట్లు ఇచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ 35 కోట్లు ఇస్తే అక్కడికే 105 కోట్లు అయిపోతుంది.
ఇంక మిగిలిన నటీనటుల రెమ్యూనరేషన్లు, అసలుకే శంకర్ 150 నుంచి 200 రోజులు పాటు షూట్ చేస్తాడు. దీనికితోడు సినిమాలో భారీ తారాగణం ఉంది. మరి వారి రెమ్యునరేషన్లు కూడా కలుపుకుంటే.. ?. అలాగే ప్రొడక్షన్ అన్నీ కలిసి మరో వంద కోట్లు దాటేస్తాయి. అంటే.. టోటల్ ప్రొడక్షన్ కాస్ట్ నే రెండు వందల ఇరవై కోట్లు అయ్యే ఛాన్స్ ఉంది. అంత డైరెక్ట్ మార్కెట్ చరణ్ కి ఉందా?. ఏమో చూడాలి.