Viswambhara Movie : మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ‘విశ్వంభర'(Viswambhara Movie) చిత్రం విడుదల తేదికి సంబంధించిన అధికారిక ప్రకటన అతి తర్వలోనే చేయనున్నారు మేకర్స్. వశిష్ట(Director Vasista) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై ప్రారంభంలో అభిమానుల్లోనే కాదు, ప్రేక్షకుల్లో కూడా అంచనాలు భారీగా ఉండేవి. కానీ ఎప్పుడైతే టీజర్ విడుదలైందో, అప్పటి నుండి ఈ సినిమాపై అంచనాలు తగ్గిపోయాయి. కారణం టీజర్ లోని గ్రాఫిక్స్ వర్క్ అత్యంత నాసిరకంగా ఉండడమే. ఈ టీజర్ పై వచ్చినన్ని ట్రోల్స్ ఇటీవల కాలంలో ఏ సినిమా టీజర్ పై కూడా రాలేదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అప్పట్లో ప్రభాస్ ‘ఆదిపురుష్’ సినిమాకి ఇలాంటికి ట్రోల్స్ వచ్చాయి. ఆ తర్వాత ‘విశ్వంభర’ కి చూసాము. వాస్తవానికి ఈ చిత్రాన్ని జనవరి 10 న విడుదల చేయాల్సి ఉంది. కానీ ‘గేమ్ చేంజర్’ కోసం వాయిదా వేశారు.
సమయం చాలా దొరకడంతో గ్రాఫిక్స్ పై చాలా బలంగా పని చేస్తున్నారు. క్వాలిటీ పరంగా వేరే లెవెల్ లో ఉండేలా చూసుకుంటున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని ఆగస్టు నెలలో విడుదల చేయాలని అనుకుంటున్నారట. కానీ మొదటి వారం లో చేస్తారా?, లేదా నెలాఖరున చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఆగస్టు 14 న ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్ లో తెరకెక్కినన్ ‘వార్ 2’ చిత్రం విడుదల కాకుంటే విశ్వంభర ఆ డేట్ కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. లేదంటే నెలాఖరున విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయట. అయితే ఆగస్టు నెలలో ఏ తేదీన విడుదల చేసిన మాకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ, పొరపాటున కూడా ఆగస్టు 22 న విడుదల చేయొద్దని అంటున్నారు మెగా అభిమానులు. ఎందుకంటే చిరంజీవి సినిమా వస్తుందంటే, దానికోసం మెగా అభిమానులు ఎంతలా ఎదురు చూస్తారో, దురాభిమానుల కూడా అంతే ఆతృతగా ఎదురు చూస్తారు.
కారణం ఇష్టమొచ్చినట్టు చిరంజీవి(Megastar Chiranjeevi) ని ట్రోల్ చేయొచ్చు అనే ఉద్దేశ్యం ఉంటుంది కాబట్టి. ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కాబట్టి, ఆ రోజు సినిమా విడుదలైతే ట్రోల్స్ ఎక్కువగా ఎదురుకోవచాల్సిన అవసరం ఉంటుంది. పుట్టినరోజు మెగాస్టార్ కి అలాంటి అనుభూతి కలగకూడదని, అందుకే ఈ సినిమాని ఆ తేదీన విడుదల చేయొద్దు అంటూ రిక్వెస్ట్ చేస్తున్నామని అభిమానులు సోషల్ మీడియా లో కామెంట్ చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాకి ఆస్కార్ అవార్డు గ్రహీత కీరణవాణి సంగీతం అందిస్తుండగా, త్రిష కృష్ణన్ హీరో గా నటిస్తుంది. అదే విధంగా కన్నడ స్టార్ హీరోయిన్ ఆషిక రంగనాథ్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తుండగా, చిరంజీవి సోదరీమణులుగా సురభి, ఇషా చావ్లా నటిస్తున్నారు. మెగాస్టార్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. చూడాలి మరి కమర్షియల్ గా ఈ చిత్రం మెగాస్టార్ కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందా లేదా అనేది.
Also Read : విడుదలైన ‘చావా’ తెలుగు వెర్షన్ థియేట్రికల్ ట్రైలర్..హీరోకి ఇచ్చిన డబ్బింగ్ అసలు సూట్ అవ్వలేదుగా!