
Ram Charan And Rajamouli- Marvel Studios: #RRR చిత్రం తో రామ్ చరణ్ , ఎన్టీఆర్ మరియు రాజమౌళి పేర్లు ప్రస్తుతం ప్రపంచం నలుమూలల మారుమోగిపోతున్న సంగతి అందరికీ తెలిసిందే.ఎన్నో అంతర్జాతీయ అవార్డ్స్ ని గెలుపొందిన ఈ సినిమా ఆస్కార్ అవార్డుని కూడా గెలుచుకోబోతుందా లేదా అనేది మరి కొద్దీ గంటల్లోనే తెలియనుంది.రేపు అమెరికా లోని లాస్ ఏంజిల్స్ లో ఈ అవార్డ్స్ ప్రదానోత్సవం జరగనుంది.
ఇదంతా కాసేపు పక్కన పెడితే, రామ్ చరణ్ మరియు రాజమౌళి కి హాలీవుడ్ లో బిలియన్ డాలర్ల వసూళ్లు వచ్చిన సినిమాలను తీసిన ‘మార్వాల్ స్టూడియోస్’ సంస్థ లో ఒక సినిమా చేసే అవకాశం వచ్చిందట.ప్రస్తుతం ఆస్కార్ అవార్డ్స్ ప్రొమోషన్స్ లో బిజీ గా ఉన్న రామ్ చరణ్ – రాజమౌళి, ఈ ఈవెంట్ అయిపోయిన వెంటనే మార్వెల్ స్టూడియోస్ సంస్థ అధినేత అవి ఆరాధ్ తో భేటీ కాబోతున్నారట.దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషనల్ టాపిక్ గా మారింది.
ఇప్పటికే ఒక సూపర్ హీరో రోల్ కి సంబంధించిన సబ్జెక్టు నా దగ్గర ఉందని, దానిని రామ్ చరణ్ ని హీరో గా పెట్టి మీరే డైరెక్ట్ చేయాలంటూ అవి ఆరాధ్ రాజమౌళి ని అడిగాడట.ఈ స్టోరీ డిస్కషన్స్ సోమవారం రోజు జరగనుంది అని టాక్.ఈ ప్రాజెక్ట్ ఫైనల్ అయితే ఇక వీళ్లిద్దరి రేంజ్ కి చేరుకోవడం అనేది ఏ ఇండియన్ హీరో కి కూడా సాధ్యపడదు అనే చెప్పాలి.

ప్రస్తుతం మహేష్ బాబు తో ఒక సినిమా చెయ్యబోతున్న రాజమౌళి, ఈ చిత్రం పూర్తి అవ్వగానే ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని తియ్యబోతున్నట్టు తెలుస్తుంది.ఒక గొప్ప విజన్ ఉన్న రాజమౌళి లాంటి దర్శకుడికి ‘మార్వెల్ స్టూడియోస్’ వంటి నిర్మాణ సంస్థ దొరకడం, ఖర్చు కి వెనకాడకుండా వాళ్ళు పెట్టే డబ్బులకు రాజమౌళి బుర్రలో పుట్టే ఆలోచనలు తోడైతే ఇక హాలీవుడ్ ని కూడా ఆయన ఎలేయడం పక్కా అని అంటున్నారు ఫ్యాన్స్.
