Homeఎంటర్టైన్మెంట్Peddi Movie Teaser Analysis: 'పెద్ది' లేటెస్ట్ టీజర్ లో ఆ స్టార్ హీరో తండ్రిని...

Peddi Movie Teaser Analysis: ‘పెద్ది’ లేటెస్ట్ టీజర్ లో ఆ స్టార్ హీరో తండ్రిని గమనించారా..? ఇది మామూలు ట్విస్ట్ కాదు..

Peddi Movie Teaser Analysis: నేడు రామ్ చరణ్(Global Star Ram charan) పుట్టిన రోజు సందర్భంగా ‘పెద్ది'(Peddi Movie) మూవీ టీం విడుదల చేసిన గ్లింప్స్ వీడియో కి అభిమానుల నుండి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. కేవలం ఒక్క బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ విషయం లోనే అభిమానులు నిరాశకు గురయ్యారు. ఎందుకంటే మొదటి గ్లింప్స్ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వేరే లెవెల్ ఉంటుంది. నేషనల్ వైడ్ గా బాగా పాపులర్ కూడా అయ్యింది. కానీ ఈ టీజర్ వీడియో లో మాత్రం ఆ రేంజ్ లో లేదు. ప్రస్తుతం మూవీ టీం చాలా టైట్ షెడ్యూల్స్ మధ్య షూటింగ్ జరుపుతుంది. మరో పక్క రీ రికార్డింగ్ వర్క్ కూడా అదే స్థాయి ఒత్తిడిలో జరుగుతోంది. ఇలాంటి సమయం లో టీజర్ విడుదల పెట్టుకోవడం వల్లే , బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పై ప్రత్యేకమైన ఫోకస్ పెట్టలేదని తెలుస్తోంది.

ఈ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బిట్ ని కూడా AR రెహమాన్ కి అందించడానికి చాలా సమయం పట్టిందట. వాస్తవానికి నిన్న సాయంత్రమే విడుదల చేయాల్సి ఉంది. కేవలం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని ఇవ్వడం ఆలస్యం అవ్వడం వల్లే ఈరోజు వదలాల్సి వచ్చిందట. ఇకపోతే ఈ కుస్తీ సన్నివేశాలన్నిటికి , బాలీవుడ్ యంగ్ హీరో విక్కీ కౌశల్ తండ్రి శ్యామ్ కౌశల్ కొరియోగ్రఫీ చేసినట్టు తెలుస్తోంది. అంతే కాదు , టీజర్ లో చూపించిన కుస్తీ ఫైట్ లో శ్యామ్ కౌశల్ కూడా కనిపిస్తాడట. అంతే కాకుండా ఈ టీజర్ లో మరో సూపర్ స్టార్ కొడుకు కూడా ఉన్నాడు. ఆయన మరెవరో కాదు , కన్నడ లెజండరీ సూపర్ స్టార్ రాజ్ కుమార్ తనయుడు , శివరాజ్ కుమార్. ఇందులో ఆయన రామ్ చరణ్ కి కుస్తీ గురువు గా కనిపించబోతున్నాడు. టీజర్ లో వచ్చిన బ్యాక్ గ్రౌండ్ వాయిస్ కూడా అతనిదే.

‘కుస్తీ అంటే బంతితో బ్యాట్ కి ఎదురెళ్ళే ఆట కాదురా, ప్రాణం తో చావు కి ఎదురెళ్ళే ఆట’ అంటూ వచ్చే బ్యాక్ గ్రౌండ్ వాయిస్ ఆయనదే. కానీ అది ఆయన సొంత వాయిస్ కాదు, డబ్బింగ్ వాయిస్. తెలుగు లో ఆయన చేస్తున్న రెండవ చిత్రమిది. గతం లో నందమూరి బాలకృష్ణ హీరో గా నటించిన ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ చిత్రం లోని ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించాడు. మళ్లీ ఇన్నాళ్లకు ఈ సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు. అదే విధంగా విక్కీ కౌశల్ తండ్రి శ్యామ్ కౌశల్ కి కూడా ఇదే తొలి తెలుగు సినిమా అనుకోవచ్చు. గతం లో కూడా ఆయన అనేక తెలుగు సినిమాలకు ఫైట్స్ కంపోజ్ చేసాడు. కానీ వెండితెర పై మాత్రం కనిపించలేదు. ఆ విధంగా ‘పెద్ది’ నే ఆయన మొదటి తెలుగు సినిమా గా భావించవచ్చు.

 

 

Peddi Pehelwan Glimpse (Telugu) | Ram Charan | Janhvi Kapoor | A R Rahman | Buchi Babu Sana

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version