Ram Charan Peddi Netflix Deal: ఓటీటీ సంస్థలు ఒకప్పటి లాగా , నిర్మాతలు ఎంత డబ్బు కోరితే అంత ఇచ్చే పరిస్థితిలో ప్రస్తుతం లేదు అనే విషయం మన అందరికీ తెలిసిందే. ఎన్నో కండీషన్స్ మీద ఓటీటీ సంస్థలు ఒప్పందాలు చేసుకుంటున్నాయి. ఎంత పెద్ద సూపర్ స్టార్ సినిమాకు అయినా సరే, ఆ కండీషన్స్ ని ఆధారంగా చేసుకొనే ఒప్పందం చేసుకుంటున్నారు. లేని పక్షంలో డీల్ రద్దు చేసుకుంటున్నారు. ఇలా ఈమధ్య కాలం లో చాలా సంఘటనలే జరిగాయి. ముఖ్యంగా ఓటీటీ సంస్థలు అనుసరించే అతి స్ట్రిక్ట్ రూల్ , నిర్మాతలు ప్రకటించే విడుదల తేదీ. ఒక్కసారి నిర్మాతలు విడుదల తేదీని ప్రకటిస్తే , ఎట్టి పరిస్థితిలోనూ వాయిదా వెయ్యకూడదు, ఒకవేళ వేస్తే ముందుగా అనుకున్న రేట్ నుండి కోత విధించబడుతుంది. కానీ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) ‘పెద్ది'(Peddi Movie) విషయం లో ఈ స్ట్రిక్ట్ రూల్ ని పక్కన పెట్టేసింది నెట్ ఫ్లిక్స్ సంస్థ.
ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్(Netflix) సంస్థ అన్ని ప్రాంతీయ భాషలకు కలిపి దాదాపుగా 140 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. ముందుగా ఈ చిత్రాన్ని మార్చి 27 న విడుదల చేస్తామని చెప్పారు మేకర్స్. కానీ ఆ తర్వాత ఏప్రిల్ 30 కి వాయిదా పడింది , ఇప్పుడు ఏకంగా జూన్ కి వాయిదా వేశారు. సాధారణంగా ఇన్ని సార్లు వాయిదా పడితే , ఏ సినిమాకు అయినా నెట్ ఫ్లిక్స్ సంస్థ కోతలు విదిస్తుంది. కానీ ‘పెద్ది’ కి మాత్రం ఎలాంటి కోతలు విధించడం లేదు. ఈ సినిమా కోసం కోట్లాది మంది ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు, మార్కెట్ లో మంచి క్రేజ్ ఉంది, కాబట్టి ఎన్ని రోజులైనా ఈ సినిమా కోసం మేము ఎదురు చూస్తాము అని నెట్ ఫ్లిక్స్ సంస్థ మేకర్స్ కి చెప్పిందట.
ఎందుకు వాళ్ళు రామ్ చరణ్ సినిమా పై ఇంత నమ్మకం పెట్టుకున్నారంటే , అందుకు కారణం #RRR చిత్రం ఒకటి అయితే , గ్లోబల్ వైడ్ గా రామ్ చరణ్ కి ఉన్నటువంటి ఫేమ్, క్రేజ్ మరో కారణం. #RRR చిత్రానికి గ్లోబల్ వైడ్ గా నెట్ ఫ్లిక్స్ నుండి 45 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇప్పటి వరకు ఇండియా లో ఏ సినిమాకు కూడా అంతటి వ్యూస్ రాలేదు. ఆ చిత్రం లో రామ్ చరణ్ మెయిన్ హీరో కావడంతో , వెస్ట్రన్ దేశాల్లో ఆయనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అందుకే నెట్ ఫ్లిక్స్ సంస్థ ‘పెద్ది’ ఎంత ఆలస్యమైనా ఎదురు చూస్తామని చెప్తోంది. ఇప్పటి వరకు ఇండియా లో ఏ సినిమాకు కూడా ఇలా జరగలేదని సమాచారం. ఇకపోతే పెద్ది చిత్రాన్ని జూన్ 4 , లేదా జూన్ 24 న విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. త్వరలోనే విడుదల తేదీని అధికారికంగా ప్రకటించబోతున్నారు.