Homeఎంటర్టైన్మెంట్Ram Charan Peddi Netflix Deal: 'పెద్ది' కి 'నెట్ ఫ్లిక్స్' స్పెషల్ ఆఫర్.. ఇప్పటి...

Ram Charan Peddi Netflix Deal: ‘పెద్ది’ కి ‘నెట్ ఫ్లిక్స్’ స్పెషల్ ఆఫర్.. ఇప్పటి వరకు ఇండియా లో ఏ సినిమాకు ఇలాంటి ఆఫర్ లేదు..

Ram Charan Peddi Netflix Deal: ఓటీటీ సంస్థలు ఒకప్పటి లాగా , నిర్మాతలు ఎంత డబ్బు కోరితే అంత ఇచ్చే పరిస్థితిలో ప్రస్తుతం లేదు అనే విషయం మన అందరికీ తెలిసిందే. ఎన్నో కండీషన్స్ మీద ఓటీటీ సంస్థలు ఒప్పందాలు చేసుకుంటున్నాయి. ఎంత పెద్ద సూపర్ స్టార్ సినిమాకు అయినా సరే, ఆ కండీషన్స్ ని ఆధారంగా చేసుకొనే ఒప్పందం చేసుకుంటున్నారు. లేని పక్షంలో డీల్ రద్దు చేసుకుంటున్నారు. ఇలా ఈమధ్య కాలం లో చాలా […]

Ram Charan Peddi Netflix Deal: ఓటీటీ సంస్థలు ఒకప్పటి లాగా , నిర్మాతలు ఎంత డబ్బు కోరితే అంత ఇచ్చే పరిస్థితిలో ప్రస్తుతం లేదు అనే విషయం మన అందరికీ తెలిసిందే. ఎన్నో కండీషన్స్ మీద ఓటీటీ సంస్థలు ఒప్పందాలు చేసుకుంటున్నాయి. ఎంత పెద్ద సూపర్ స్టార్ సినిమాకు అయినా సరే, ఆ కండీషన్స్ ని ఆధారంగా చేసుకొనే ఒప్పందం చేసుకుంటున్నారు. లేని పక్షంలో డీల్ రద్దు చేసుకుంటున్నారు. ఇలా ఈమధ్య కాలం లో చాలా సంఘటనలే జరిగాయి. ముఖ్యంగా ఓటీటీ సంస్థలు అనుసరించే అతి స్ట్రిక్ట్ రూల్ , నిర్మాతలు ప్రకటించే విడుదల తేదీ. ఒక్కసారి నిర్మాతలు విడుదల తేదీని ప్రకటిస్తే , ఎట్టి పరిస్థితిలోనూ వాయిదా వెయ్యకూడదు, ఒకవేళ వేస్తే ముందుగా అనుకున్న రేట్ నుండి కోత విధించబడుతుంది. కానీ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) ‘పెద్ది'(Peddi Movie) విషయం లో ఈ స్ట్రిక్ట్ రూల్ ని పక్కన పెట్టేసింది నెట్ ఫ్లిక్స్ సంస్థ.

ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్(Netflix) సంస్థ అన్ని ప్రాంతీయ భాషలకు కలిపి దాదాపుగా 140 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. ముందుగా ఈ చిత్రాన్ని మార్చి 27 న విడుదల చేస్తామని చెప్పారు మేకర్స్. కానీ ఆ తర్వాత ఏప్రిల్ 30 కి వాయిదా పడింది , ఇప్పుడు ఏకంగా జూన్ కి వాయిదా వేశారు. సాధారణంగా ఇన్ని సార్లు వాయిదా పడితే , ఏ సినిమాకు అయినా నెట్ ఫ్లిక్స్ సంస్థ కోతలు విదిస్తుంది. కానీ ‘పెద్ది’ కి మాత్రం ఎలాంటి కోతలు విధించడం లేదు. ఈ సినిమా కోసం కోట్లాది మంది ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు, మార్కెట్ లో మంచి క్రేజ్ ఉంది, కాబట్టి ఎన్ని రోజులైనా ఈ సినిమా కోసం మేము ఎదురు చూస్తాము అని నెట్ ఫ్లిక్స్ సంస్థ మేకర్స్ కి చెప్పిందట.

ఎందుకు వాళ్ళు రామ్ చరణ్ సినిమా పై ఇంత నమ్మకం పెట్టుకున్నారంటే , అందుకు కారణం #RRR చిత్రం ఒకటి అయితే , గ్లోబల్ వైడ్ గా రామ్ చరణ్ కి ఉన్నటువంటి ఫేమ్, క్రేజ్ మరో కారణం. #RRR చిత్రానికి గ్లోబల్ వైడ్ గా నెట్ ఫ్లిక్స్ నుండి 45 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇప్పటి వరకు ఇండియా లో ఏ సినిమాకు కూడా అంతటి వ్యూస్ రాలేదు. ఆ చిత్రం లో రామ్ చరణ్ మెయిన్ హీరో కావడంతో , వెస్ట్రన్ దేశాల్లో ఆయనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అందుకే నెట్ ఫ్లిక్స్ సంస్థ ‘పెద్ది’ ఎంత ఆలస్యమైనా ఎదురు చూస్తామని చెప్తోంది. ఇప్పటి వరకు ఇండియా లో ఏ సినిమాకు కూడా ఇలా జరగలేదని సమాచారం. ఇకపోతే పెద్ది చిత్రాన్ని జూన్ 4 , లేదా జూన్ 24 న విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. త్వరలోనే విడుదల తేదీని అధికారికంగా ప్రకటించబోతున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper