Ram Charan Peddi Movie Updates: రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పెద్ది’ సినిమా ఏప్రిల్ 30వ తేదీన ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమాతో రామ్ చరణ్ ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది. గత సంవత్సరం ఆయన చేసిన ‘గేమ్ చేంజర్’ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. దాంతో ఆయన మార్కెట్ కొంతవరకు పడిపోయింది. ఇక ఇప్పుడు ‘పెద్ది’ సినిమాతో భారీ విజయాన్ని సాధించి తన మార్కెట్ ను మరింత పెంచుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. పాన్ ఇండియాలో రామ్ చరణ్ కి క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ ను వాడుకుంటూ ఆయన తన స్టార్ డమ్ ను విస్తరించుకునే ప్రయత్నం చేస్తాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే పెద్ది సినిమా విషయంలో సుకుమార్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఎక్కువ అవుతుందనే వార్తలు వస్తున్నాయి. బుచ్చిబాబు అక్కడక్కడ తడబడుతున్నప్పుడు సుకుమార్ దానిని సరిపెడుతున్నట్టుగా తెలుస్తుంది.
Also Read: ‘ధురంధర్ 2’ తో పోటీ పడడం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టీం చేసిన పెద్ద మిస్టేక్.. ఓవర్సీస్ లో చావు దెబ్బ!
ఇక ఫైనల్ గా సుకుమార్ సైతం ఈ సినిమాని చూసి కొన్ని మార్పులు చేర్పులు చేయమని చెప్పారట. దానికి సినిమా యూనిట్స్ అంగీకరించి మార్పులు చేర్పులు చేయడానికి సన్నహాలు చేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే బుచ్చిబాబు ఈ సినిమాని ఏ రేంజ్ సక్సెస్ గా నిలుపుతాడు.
రామ్ చరణ్ కి ఒక అదిరిపోయే గిఫ్ట్ ఇస్తాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమా తర్వాత బుచ్చిబాబుకు పెద్ద హీరోల నుంచి ఆఫర్లైతే వస్తున్నాయి. మరి వాటిని అందుకోవాలంటే మాత్రం ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా నిలవాల్సిన అవసరమైతే ఉంది… ఇక మొత్తానికైతే బుచ్చిబాబు తను అనుకున్న రీతిలోనే ముందుకు సాగుతున్నాడు.
తన గురువు సుకుమార్ మార్కును ఫాలో అవుతూ సినిమాని సక్సెస్ఫుల్గా నిలుపుతానని రామ్ చరణ్ అభిమానులకు మాటిచ్చాడు. రామ్ చరణ్ సైతం ఈ సినిమా తర్వాత సుకుమార్ డైరెక్షన్ లో మరో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇప్పటికే వీళ్ళ కాంబినేషన్ లో ‘రంగస్థలం’ అనే సినిమా వచ్చింది. ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసింది. ఇక వీళ్ళ కాంబోలో రాబోయే సినిమా ఇంకెన్ని రికార్డులను బ్రేక్ చేస్తుందో చూడాలి…