Peddi movie second song: వరుస ఫ్లాప్స్ తో డీలాపడిన మెగాఫ్యామిలీ, గత ఏడాది సెప్టెంబర్ నెలలో విడుదలైన ‘ఓజీ'(They Call Him OG) చిత్రం తో భారీ కం బ్యాక్ ఇచ్చింది. ఈ సినిమా తర్వాత రీసెంట్ గా సంక్రాంతి కానుకగా విడుదలైన ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu) చిత్రం తో మరో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకొని, సక్సెస్ స్ట్రీక్ ని కొనసాగించింది. ఇప్పుడు ఈ రెండు సినిమాలు తెచ్చిన సక్సెస్ ని కొనసాగిస్తూ మరో లెవెల్ కి తీసుకెళ్లే బాధ్యత రామ్ చరణ్(Global Star Ram Charan) ‘పెద్ది'(Peddi Movie) చిత్రంపై ఉంది. బుచ్చి బాబు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లోనే కాదు, ప్రేక్షకుల్లో కూడా అంచనాలు వేరే లెవెల్ లో ఉన్నాయి. బ్లాక్ బస్టర్ గ్లింప్స్ వీడియో తో అందరి దృష్టిని ముందుగా ఆకర్షించిన ఈ సినిమా, ఆ తర్వాత ‘చికిరి..చికిరి’ పాట తో ఈ సినిమాపై ఎవ్వరూ ఊహించని రేంజ్ లో అంచనాలు పెరిగేలా చేసింది.
కేవలం యూట్యూబ్ నుండే అన్ని భాషలకు సంబంధించి 200 మిల్లియన్లకు పైగా వ్యూస్ వచ్చాయంటే చిన్న విషయం కాదు. ఇంత పెద్ద చార్ట్ బస్టర్ సాంగ్ తర్వాత ఈ సినిమాపై మాత్రమే కాదు, మ్యూజిక్ ఆల్బమ్ మీద కూడా అంచనాలు బాగా పెరిగిపోయాయి. రెండవ పాట కోసం అభిమానులు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నారు. వాస్తవానికి ఈ పాట ని డిసెంబర్ నెలలోనే విడుదల చెయ్యాలని అనుకున్నారట. కానీ టెక్నీకల్ పనులు బ్యాలన్స్ ఉండడంతో కుదర్లేదు. ఆ తర్వాత సంక్రాంతికి విడుదల చేసే ప్లాన్స్ ఉన్నప్పటికీ, మెగాస్టార్ చిరంజీవి సినిమా విడుదల ఉండడం తో, మెగా అభిమానులను అనవసరం గా డీవియేట్ చేయకుండా ఉండడం కోసం విడుదల చేయలేదట. ఇప్పుడు పాట రెడీ గానే ఉంది కానీ, లిరికాల్ వీడియో మాత్రం సిద్ధంగా లేదట. అది రెడీ అవ్వాలంటే మరో వారం, లేదా పది రోజుల సమయం పట్టేలా ఉందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
లిరికల్ వీడియో లాగా కాకుండా ‘చికిరి..చికిరి’ స్టైల్ లో సైరికొత్తగా ఈ వీడియో ని విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారట మేకర్స్. మరి ఆ సర్ప్రైజ్ ఏంటో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే. ఈ నెలాఖరుకు ఈ పాట విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది కూడా మంచి డ్యాన్స్ బీట్ ఉన్న పాట అట. చికిరి చికిరి కి మించిన స్టెప్పులు కంపోజ్ చేసాడట కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్. చికిరి స్టెప్ ఎలా అయితే గ్లోబల్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేసిందో, ఈ పాట అంతకు మించిన సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని అంటున్నారు. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇంకా 30 రోజుల వరకు బ్యాలన్స్ ఉందట. మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చెయ్యాలని అనుకున్నారు కానీ, ఇప్పుడు వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.