Homeఎంటర్టైన్మెంట్Chikiri Chikiri Song 200 Million Views: అక్షరాలా 200 మిలియన్ వ్యూస్.. 'చికిరి చికిరి'...

Chikiri Chikiri Song 200 Million Views: అక్షరాలా 200 మిలియన్ వ్యూస్.. ‘చికిరి చికిరి’ ఖాతాలో మరో గ్లోబల్ రికార్డు..

Chikiri Chikiri Song 200 Million Views: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) నటించిన ‘పెద్ది'(Peddi Movie) చిత్రం ప్లాన్ ప్రకారం ఈ నెల 30 న ప్రేక్షకుల ముందుకు రావాలి. కానీ మేకర్స్ నుండి ఇప్పటి వరకు ఎలాంటి చప్పుడు లేదు. చాలామంది ఈ చిత్రాన్ని జూన్ 25 కి వాయిదా వేశారని అంటున్నారు. కానీ దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ సినిమా విడుదల తేదీ పై అభిమానుల్లో, ప్రేక్షకుల్లో ఒక పెద్ద గందరగోళం నెలకొంది. చాలా కాలం తర్వాత రామ్ చరణ్ సినిమాకు అభిమానులు , ప్రేక్షకులు ఒక రేంజ్ లో హైప్ అయ్యి ఉన్నారు. కచ్చితంగా ఈ చిత్రం కుంభస్థలం బద్దలు కొట్టబోతుంది అనే నమ్మకం అందరిలోనూ ఏర్పడింది. ఇప్పటి వరకు ఈ సినిమా నుండి వచ్చిన కంటెంట్ అలాంటిది మరీ. ముఖ్యంగా ‘చికిరి చికిరి’ పాట సృష్టించిన గ్లోబల్ సునామీ సాధారమైనది కాదు.

ఎక్కడ చూసినా యూత్, మాస్ ఆడియన్స్ ఈ పాటకు చిందులు వేస్తూ ఒక రేంజ్ లో వైబ్ అవుతున్నారు. మ్యూజిక్ ప్లాట్ ఫార్మ్స్ లో ఎన్నో ఆల్ టైం రికార్డ్స్ ని నెలకొల్పిన ఈ చార్ట్ బస్టర్ సాంగ్ , ఇప్పుడు యూట్యూబ్ లో మరో సరికొత్త రికార్డు ని నెలకొల్పింది. కేవలం తెలుగు వెర్షన్ లోనే ఈ పాటకు 200 మిల్లియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. విడుదలకు ముందు ఈమధ్య కాలం లో ఒక స్టార్ హీరో సినిమా బ్లాక్ బస్టర్ పాటకు ఈ రేంజ్ వ్యూస్ రావడం జరగలేదు. 2024 వ సంవత్సరం సెప్టెంబర్ లో విడుదలైన ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రం లోని చుట్టమల్లే పాటకు ఇదే రేంజ్ వ్యూస్ వచ్చాయి. అప్పట్లో ఈ రికార్డుని భవిష్యత్తులో అందుకోవడం కష్టమేనేమో అని అంతా అనుకున్నారు. కానీ ‘చికిరి చికిరి’ పాటకు అదే రేంజ్ రెస్పాన్స్ వస్తుందని ముందుగా ఎవ్వరూ ఊహించలేదు.

కేవలం తెలుగు వెర్షన్ లోనే కాదు , హిందీ వెర్షన్ లో కూడా ఈ పాటకు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. హిందీ లో ఇప్పటి వరకు ఈ పాటకు 55 మిల్లియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. లైక్స్ దాదాపుగా 6 లక్షలకు పైగానే ఉంది. హిందీ లో ఈ రేంజ్ రెస్పాన్స్ ని గతం లో పుష్ప సిరీస్ లోని పాటలు మాత్రమే సంపాదించుకున్నాయి. ఆ తర్వాత మళ్లీ ‘పెద్ది’ కి ఆ అవకాశం దక్కింది. అదే విధంగా తమిళ వెర్షన్ పాటకు 6.8 మిలియన్ వ్యూస్ రాగా, కన్నడ వెర్షన్ పాటకు 6.2 మిలియన్ వ్యూస్ , మలయాళం వెర్షన్ పాటకు 2.6 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఓవరాల్ గా ఈ పాటకు యూట్యూబ్ లో అన్ని వెర్షన్స్ కి కలిపి 270 మిల్లియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. భవిష్యత్తులో ఈ పాట ఇంకా ఎన్ని మైలు రాళ్లను దాటుతుందో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Bangladesh Army : మారిన బంగ్లాదేశ్ సైన్యం.. భారత్ కు డేంజర్ బెల్స్

Bangladesh Army : భారతదేశంతో సుమారు 4,096 కిలోమీటర్ల సరిహద్దు పంచుకునే బంగ్లాదేశ్‌ పుట్టుకకు మనమే కారణం. భారత సైన్యం చొరవతోనే ఆ దేశం పుట్టింది. ఆ కృతజ్ఞతతో ఇంతకాలం మనతో సత్సంబంధాలు...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం: కష్టపడ్డ బొద్దింకల కాళ్లు విరిగాయి.. స్వార్థ బొద్దింకలు...

Cockroach Janata Party : ఢిల్లీలోని జంతర్ మంతర్.. అతని పేరు జునైద్.. సొంత రాష్ట్రం ఉత్తర ప్రదేశ్.. ఫోన్ మెకానిక్ గా పని చేస్తూ ఉంటాడు. ఇతడు కాక్రోచ్ జనతా పార్టీ...

ODI World Cup 2027 : వైభవ్ తో రోహిత్.. వన్డే వరల్డ్ కప్ లో ఈ కాంబినేషన్...

ODI World Cup 2027 : శీర్షిక చదివారు కదా.. ఈ కంటెంట్ లో ఉన్న మ్యాటర్ ఏంటో అర్థమైంది కదా.. ఇప్పుడు టీమిండియాకు కావలసింది అదే. ఎందుకంటే 2023లో భారత జట్టు...

Vijay Government : విజయ్ ప్రభుత్వానికి బిగ్ షాక్.. ఇది మామూలు దెబ్బ కాదు

Vijay Government : ప్రభుత్వ ఉద్యోగం ఉచితంగా ఇచ్చేది కాదు.. పంచిపెట్టేది కాదు.. అర్హులకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలి.. ప్రభుత్వం రాజ్యాంగ పరిమితులకు లోబడి వ్యవహరించాలి.. ఇదీ మద్రాస్ హైకోర్టు సోమవారం ఇచ్చిన...

Weight Loss: కిలో బరువు తగ్గాలంటే ఎంతసేపు నడవాలి?

Weight Loss: ప్రస్తుత కాలంలో బరువు తగ్గించాలని చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు .చాలా వరకు త్వరగా ఫలితం రావాలని కోరుకుంటారు. ముఖ్యంగా కిలో బరువు ఒక వారంలో తగ్గాలనే లక్ష్యంతో ఆహారం...
Oktelugu Epaper
Exit mobile version