Homeఎంటర్టైన్మెంట్NTR Dragon Movie Villain Update: ఎన్టీఆర్ 'డ్రాగన్' లో విలన్ గా బాలీవుడ్ క్రేజీ...

NTR Dragon Movie Villain Update: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ లో విలన్ గా బాలీవుడ్ క్రేజీ యంగ్ హీరో.. పూర్తి వివరాలు ఎక్సక్లూసివ్ గా మీకోసం..

NTR Dragon Movie Villain Update: ఎన్టీఆర్(Junior NTR), ప్రశాంత్ నీల్(Prashanth Neel) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ చిత్రం పై అటు అభిమానుల్లో, ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలు సాధారణమైనవి కాదు. ఇప్పటి వరకు ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ ఒక్కటి కూడా బయటకు రాలేదు. కనీసం టైటిల్ ని కూడా అధికారికంగా చెప్పలేదు అయినప్పటికీ కూడా కనీవినీ ఎరుగని రేంజ్ క్రేజ్ ని సొంతం చేసుకుంది ఈ చిత్రం. ఇక ఈ చిత్రం నుండి ప్రమోషనల్ కంటెంట్ ఒక్కొక్కటిగా బయటకు వస్తుంటే , మార్కెట్ లో ఎలాంటి క్రేజ్ ఏర్పడుతుందో మీరే ఊహించుకోండి. వచ్చే ఏడాది చివర్లో విడుదల కాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే ఈ చిత్రం లో విలన్ రోల్ కోసం బాలీవుడ్ యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న షాహిద్ కపూర్ ని సంప్రదించారట మేకర్స్.

వాస్తవానికి ముందుగా ఈ చిత్రం లో విలన్ రోల్ కోసం మలయాళం స్టార్ హీరోల్లో ఒకరైన తొనివో థామస్ ని ఎంచుకున్నారు. ఒక నెలరోజుల పాటు ఎన్టీఆర్, తొనివో లపై ఎన్నో సన్నివేశాలు తెరకెక్కించారు. కానీ వాటి ఔట్పుట్ పై డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సంతృప్తి చెందకపోవడం తో , వాటిని మొత్తం స్క్రాప్ చేసి , మళ్లీ కొత్తగా తియ్యాలని అనుకున్నారు. కానీ తొనివో థామస్ డేట్స్ ఇవ్వడానికి నిరాకరించాడు. డేట్స్ సర్దుబాటు చేయలేకపోయానని, మలయాళం లో వరుసగా మూడు సినిమాల్లో నటిస్తుండడం వల్ల , ఈ సినిమా నుండి తప్పుకోవాల్సి వచ్చింది అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో మేకర్స్ ఇప్పుడు పాత్ర కోసం కొంతమంది యంగ్ హీరోలను పరిశీలించి చివరికి షాహిద్ కపూర్ వద్దకు చేరింది. మరి షాహిద్ ఈ చిత్రం లో విలన్ గా నటించడానికి ఒప్పుకుంటాడా లేదా అనేది చూడాలి.

ఒకవేళ చేస్తే మాత్రం చాలా సినిమాకు చాలా పెద్ద పాజిటివ్ అవుతుందనే చెప్పాలి . ఎందుకంటే షాహిద్ కి బాలీవుడ్ లో ఉన్న క్రేజ్ సాధారమైనది కాదు. సరైన సినిమా పడాలి కానీ, బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లను కొల్లగొట్టగలడు. కబీర్ సింగ్ చిత్రం అందుకు ఒక ఉదాహరణ. అంతే కాకుండా బజ్ లేని సినిమాలకు కూడా ఇతను మినిమం గ్యారంటీ ఓపెనింగ్స్ ని రప్పిస్తుంటాడు . వీటికి అన్నిటికి మించి ఒక మంచి డ్యాన్సర్ కూడా. ఇన్ని పాజిటివ్ ఎలిమెంట్స్ ఉన్నటువంటి ఈ క్రేజీ హీరో ఈ మెగా ప్రాజెక్ట్ లోకి అడుగుపెడితే బాలీవుడ్ లో భారీ వసూళ్లు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి ఒప్పుకుంటాడా లేదో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version