Peddi Movie : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) ప్రస్తుతం శ్రీలంక లో ‘పెద్ది'(Peddi Movie) మూవీ షూటింగ్ లో ఫుల్ బిజీ గా ఉన్నాడు. బుచ్చి బాబు దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమా పై అభిమానుల్లో, ప్రేక్షకుల్లో అంచనాలు భారీ రేంజ్ లో ఉన్నాయి. ‘గేమ్ చేంజర్’ చిత్రం భారీ డిజాస్టర్ అయినప్పటికీ కూడా ఈ సినిమా పై ఇంతటి అంచనాలు మార్కెట్ లో ఏర్పడడానికి ముఖ్య కారణం, రామ్ చరణ్ రూరల్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రాన్ని చేస్తుండడం వల్లే. గతం లో ఇదే బ్యాక్ డ్రాప్ లో ఆయన నటించిన ‘రంగస్థలం’ చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యిందో మనమంతా చూసాము. నటుడిగా కూడా రామ్ చరణ్ కి గొప్ప పేరొచ్చింది. ‘పెద్ది’ కూడా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్ర కావడంతో, ఈ సినిమా మరో రంగస్థలం అవుతుందని అభిమానుల నమ్మకం.
అది కాసేపు పక్కన పెడితే ఈ సినిమా లో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘దేవర’ లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత ఆమె చేస్తున్న చిత్రమిది. ఇందులో రామ్ చరణ్ క్యారక్టర్ తో పాటు, జాన్వీ కపూర్ క్యారక్టర్ కి కూడా నటనకు ప్రాధాన్యత ఉందట. నవంబర్ మొదటి వారం లో వీళ్లిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన ఒక సాంగ్ కి సంబంధించిన లిరికల్ వీడియో సాంగ్ ని విడుదల చేయబోతున్నారు మేకర్స్. ఇది ఒక టీజింగ్ పాట అట. అంటే హీరోయిన్ జాన్వీ కపూర్ ని రామ్ చరణ్ వెక్కిరిస్తూ చేసే పాట అన్నమాట. ఆయన మొదటి చిత్రం చిరుత లో మొదటి పాట కూడా ఇలాంటిదే. ఆ పాట ఆయనకు ఇంతమంచి పేరు తీసుకొచ్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. నవంబర్ లో విడుదల అవ్వబోయే ‘పెద్ది’ టీజింగ్ పాట కూడా అదే విధంగా ఉండబోతుందట.
ఈ పాటలో రామ్ చరణ్ స్టెప్పులు చాలా బాగుంటాయని, ఫ్యాన్స్ కి ఒక విజువల్ ఫీస్ట్ లాగా ఉంటుందని అంటున్నారు. దేశం లోనే టాప్ 3 డ్యాన్సర్స్ లో ఒకరైన రామ్ చరణ్ కి ఈమధ్య కాలం లో సరైన స్టెప్పులు ఉన్న పాటలు పడడం లేదు. ‘గేమ్ చేంజర్’ లో డ్యాన్స్ కి స్కోప్ ఉన్న పాటలు చాలానే ఉన్నాయి కానీ, ఎందుకో కొరియోగ్రఫీ కుదర్లేదు. కానీ ‘పెద్ది’ లో మాత్రం చాలా చక్కగా కుదిరాయి అట. ఈ పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందించాడు. ఇక ఈ సినిమా ఆల్బుమ్ కి AR రెహ్మాన్ మ్యూజిక్ అందిస్తున్న సంగతి తెలిసిందే. పాటలన్నీ చాలా అద్భుతంగా వచ్చాయని టాక్. రెహ్మాన్ లోని కొత్త కోణం ఈ సినిమా ద్వారా చూడబోతున్నాం అట.