Ram Charan and NTR : తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటుడు రామ్ చరణ్ (Ram Charan)…ఆయన నటించిన ప్రతి సినిమా యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని మెప్పిస్తూ ఆయనకంటూ ఒక గొప్ప గుర్తింపు సంపాదించడమే కాకుండా గ్లోబల్ స్టార్ గా కూడా అవతరించాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన నుంచి వస్తున్న ప్రతి సినిమా ఇండస్ట్రీ రికార్డులను కొల్లగొడుతుంది అంటూ తమ అభిమానులైతే ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇక ప్రస్తుతం ఆయన బుచ్చిబాబు (Buchhi Babu) డైరెక్షన్ లో పెద్ది (Peddi) అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ విజయాన్ని అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నాడు. ఇక ఇలాంటి సందర్భంలో ఈ సినిమాతో ఆయన ఎలాంటి పెను ప్రభంజనాన్నీ సృష్టిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో రామ్ చరణ్ తన స్టామినా మొత్తాన్ని చూపించి ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న పలు రికార్డులను సైతం కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
Also Read : రామ్ చరణ్,ఎన్టీఆర్ కాంబినేషన్ లో మరో మల్టీస్టారర్..డైరెక్టర్ ఎవరంటే!
నందమూరి ఫ్యామిలీ మూడో తరం హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ సైతం తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. గత సంవత్సరం ‘దేవర’ (devara) సినిమాతో పాన్ ఇండియా లో సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించిన ఆయన ఇప్పుడు వార్ (War 2) ప్రశాంత్ నీల్ తో చేస్తున్న సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు.
ఇక వీళ్లిద్దరి మధ్య మంచి సన్నిహిత్యమైతే ఉంది. మొదటి నుంచి కూడా వీళ్లకు మంచి ఫ్రెండ్షిప్ ఉండటమే కాకుండా ‘త్రిబుల్ ఆర్’ (RRR) కలిసి నటించి వాళ్లను వాళ్ళు స్టార్లుగా మరోసారి ఎలివేట్ చేసుకునే ప్రయత్నం చేశారు. మరి మొత్తానికైతే ఈ సినిమాలో వీళ్ళిద్దరి క్యారెక్టర్ చాలా అద్భుతంగా క్రియేట్ చేశారు. ఇక రాజమౌళి ఈ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర వహించడమే కాకుండా వీళ్ళిద్దరూ విజయాన్ని అందుకొని వాళ్ళకంటూ ఒక సపరేట్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నారు.
ఇక రామ్ చరణ్ చేయాల్సిన ఒక సినిమాని ఎన్టీఆర్ చేసి సూపర్ సక్సెస్ సాధించడనే విషయం మనలో చాలామందికి తెలియదు. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ (Janatha Garage) సినిమాని మొదట రామ్ చరణ్ తో చేయాలని అనుకున్నారట.కానీ అనుకోని కారణాలవల్ల ఆ కాంబినేషన్ అయితే సెట్ అవ్వలేదు. దాంతో ఎన్టీఆర్ తో ఆ సినిమా చేసి సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించారు.
Also Read : రామ్ చరణ్ హిట్ కొడితే ఎన్టీఆర్ బాధపడక తప్పదు.. లాజిక్ ఇదే!