
డైలాగ్ రైటర్ గా సంవత్సరాలు పని చేసినా అనిల్ రావిపూడికి స్టార్ డమ్ రాలేదు. కానీ, డైరెక్టర్ అయ్యాక వరుస సక్సెస్ లతో సూపర్ ఛాన్స్ కొట్టేసి.. డీసెంట్ కామెడీని హ్యాండిల్ చేయడంలో ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని మొత్తానికి స్టార్ హీరోల హాట్ ఫేవరేట్ డైరెక్టర్ గా మారిపోయాడు అనిల్. కాగా రామ్ చరణ్ మేనేజర్ ప్రవీణ్ ఇటీవల అనిల్ రావిపూడిని కలిశారట. ఆయనతో కథ విషయమై సంప్రదింపులు జరిపారట. ఆర్ఆర్ఆర్ చిత్రీకరణ పూర్తి కానున్న నేపథ్యంలో రామ్‌చరణ్ తన తర్వాతి సినిమా కోసం కథలు వింటున్నాడట.
Also Read: ప్రభాస్ కి డేట్స్ ఇవ్వని హాట్ బ్యూటీ !
కాగా అందులో భాగంగానే చెర్రీకి అనిల్ ఓ కథ చెప్పాడట. ఆ కథ నచ్చడంతో అనిల్‌తో పనిచేసేందుకు చెర్రీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. ఇలా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కలయికలో మొత్తానికి త్వరలోనే ఓ సినిమా రాబోతుంది అన్నమాట. ఏది ఏమైనా తనదైన మార్క్ టైమింగ్ తో, తన మార్క్ డైలాగ్ లతో, వరుస విజయాలను అందుకుంటున్న ఈ టాలెంటెడ్ డైరెక్టర్ కి ఎదురేలేకుండా పోయింది. కష్టకాలంలో ఉన్న కళ్యాణ్ రామ్ కి పటాస్ తో కెరీర్ బెస్ట్ హిట్ అందించాడు అనిల్.
Also Read: డైరెక్టర్ ను పెళ్లాడబోతున్న హీరోయిన్ !
ఆ తరువాత మరో యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ కెరీర్ స్టార్టింగ్ లోనే రేయ్ లాంటి భారీ డిజాస్టర్ అందుకున్న టైంలో ‘సుప్రీమ్’తో మంచి కమర్షియల్ మూవీ ఇచ్చి తేజ్ కెరీర్ కే మంచి ఊపు తెచ్చాడు. తన మూడో చిత్రం ‘రాజా ది గ్రేట్’. రవితేజ్ ను బ్లైండ్ క్యారెక్టర్ లో చూపించి హిట్ కొట్టాడు. తన సినిమాల్లో ఎలాంటి గొప్ప కథ తీసుకోకుండానే.. కేవలం తన శైలి కామెడీ క్యారెక్టరైజేషన్స్ తో, కామెడీ సీన్స్ తోనే సినిమాని హిట్ చెయ్యటం అంటే నిజంగా అనిల్ రావిపూడికే సాధ్యం అనుకుంటా. ఇక సూపర్ స్టార్ మహేశ్ బాబుతో ‘సరిలేరు నీకెవ్వరు’తో అలాగే ఎఫ్ 2తో సూపర్ హిట్స్ కొట్టి ఫుల్ ఫామ్ లో కొనసాగుతూ ఎఫ్ 3 చేస్తున్నాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్