https://oktelugu.com/

ట్రైలర్ టాక్: క్రీడలపై సందీప్ కిషన్ సంధించిన ‘ఏ1 ఎక్స్ ప్రెస్’

సందీప్ కిషన్.. ఎప్పుడో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో హిట్టు కోసం చకోర పక్షిలా తిరుగుతూనే ఉన్నాడు. ఎన్ని సినిమాలు పోయినా కొత్త సినిమాలతో కొత్తగా ట్రై చేస్తున్నాడు.కొన్ని హిట్స్ అవుతున్నాయి. చాలా ఫ్లాప్స్ అవుతున్నాయి. అయినా మొక్కవోని పట్టుదలతో తీస్తున్నాడు. ఈ మధ్య తమిళంలోనూ సినిమాలు తీస్తున్నాడు. తాజాగా హాకీ ప్లేయర్ కథతో ‘ఏ1 ఎక్స్ ప్రెస్’ అంటూ సందీప్ కిషన్ మన ముందుకు వస్తున్నాడు. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ […]

Written By:
  • NARESH
  • , Updated On : January 26, 2021 / 06:15 PM IST
    Follow us on

    సందీప్ కిషన్.. ఎప్పుడో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో హిట్టు కోసం చకోర పక్షిలా తిరుగుతూనే ఉన్నాడు. ఎన్ని సినిమాలు పోయినా కొత్త సినిమాలతో కొత్తగా ట్రై చేస్తున్నాడు.కొన్ని హిట్స్ అవుతున్నాయి. చాలా ఫ్లాప్స్ అవుతున్నాయి. అయినా మొక్కవోని పట్టుదలతో తీస్తున్నాడు. ఈ మధ్య తమిళంలోనూ సినిమాలు తీస్తున్నాడు.

    తాజాగా హాకీ ప్లేయర్ కథతో ‘ఏ1 ఎక్స్ ప్రెస్’ అంటూ సందీప్ కిషన్ మన ముందుకు వస్తున్నాడు. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ అయ్యింది. దేశంలో క్రికెట్ కాకుండా మిగతా క్రీడల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది.? ఆ క్రీడాకారుల కష్టాలు.. హాకీ ప్లేయర్ గా జాతీయ జట్టుకు ఆడడానికి పడిన కష్టాలను ‘ఏ1’ మూవీలో సందీప్ కిషన్ కళ్లకు కట్టాడు.

    ఆటలను సైతం నియంత్రిస్తున్న వ్యాపార, కార్పొరేట్ వర్గాల తీరును సినిమాలో కళ్లకు కట్టాడు. ‘మనదేశంలో స్పోర్ట్స్ మెన్ కు ఇవ్వాల్సిన కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదు సార్.. ఇక్కడ బిజినెస్ అయి చాలాకాలం అయ్యింది. అన్నీ బిజినెస్ మెన్ లే డిసైడ్ చేస్తున్నారని’ సందీప్ కిషన్ చెప్పిన డైలాగ్ తో సినిమా కథ ఏంటో తేటతెల్లమైంది.

    జీవన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ట్రైలర్ ను గణతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేశారు. సందీప్ పక్కన లావణ్య హీరోయిన్ గా నటించింది. రావు రమేశ్ విలన్ గా చేసినట్టు అర్థమవుతోంది. ఫిబ్రవరిలో సినిమా థియేటర్లలోకి రానుంది.

    ట్రైలర్ ను కింద చూడొచ్చు.