Priyanka Chopra: రాజమౌళి(SS Rajamouli) టీం నిన్న మహేష్(Super Star Mahesh Babu) ఫ్యాన్స్ ఊహకందని సర్ప్రైజ్ ని అందించి షాక్ కి గురి చేసింది. #Globetrotter టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన థీమ్ సాంగ్ ని గుట్టుచప్పుడు కాకుండా విడుదల చేసి సోషల్ మీడియా లో సెన్సేషన్ సృష్టించారు. శృతి హాసన్ గాత్రం అందించిన ఈ పాట ఇప్పుడు వైల్డ్ ఫైర్ లాగా వ్యాప్తి చెందింది. ఎక్కడ చూసిన ఈ పాట నే వినిపిస్తోంది. కానీ ముందుగానే ప్రకటన చేసుంటే మేము ఈ పాటకు ఆల్ టైం రికార్డ్స్ ని పెట్టేవాళ్ళం కదా అని మహేష్ ఫ్యాన్స్ కాస్త నిరసన తెలిపారు. ఇప్పటి వరకు యూట్యూబ్ లో ఈ పాటకు 4 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయి. పాట మొత్తం ‘సంచారి..సంచారి’ అంటూ వచ్చింది కాబట్టి, ఈ చిత్రానికి అదే టైటిల్ ని ఫిక్స్ చేశారా అనే అనుమానాలు అభిమానుల్లో వ్యక్తం అవుతున్నాయి.
Also Read: సందీప్ వంగ తో రామ్ చరణ్ కొత్త సినిమా..? స్టోరీ లైన్ మామూలు రేంజ్ లో లేదుగా!
నిన్న మొన్నటి వరకు ఈ చిత్రానికి ‘వారణాసి’ అనే టైటిల్ ని పెట్టినట్టు సోషల్ మీడియా లో వార్తలు వినిపించాయి. కానీ థీమ్ సాంగ్ లో ఎక్కడా కూడా వారణాసి అనే పదాన్ని ఉపయోగించలేదు. దీంతో ఈ చిత్రానికి రాజమౌళి ‘సంచారి’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో ఎంత మాత్రం నిజముంది అనేది తెలియాలంటే 15 వ తేదీ వరకు ఆగాల్సిందే. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రం లో పృథ్వీ రాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రా(Priyanka Chopra) విలన్ క్యారెక్టర్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గానే పృథ్వీ రాజ్ ఫస్ట్ లుక్ ని విడుదల చేయగా, దానికి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక రేపు ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్ ని విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే ప్రియాంక చోప్రా పోషించే విలన్ క్యారక్టర్ కోసం రాజమౌళి ముందుగా ఇద్దరు హీరోయిన్స్ ని సంప్రదించారట.
అందులో ఒకరు ఐశ్వర్య రాయ్. #RRR మూవీ షూటింగ్ పూర్తి అయిన అతి కొద్దిరోజుల్లోనే రాజమౌళి ఈ పాత్ర కోసం ఐశ్వర్య ని సంప్రదించాడట. అయితే ఏ కారణం చేతనో తెలియదు కానీ ఆ క్యారక్టర్ చేయడానికి ఆమె అంగీకరించలేదు. ఇక ఆ తర్వాత మన టాలీవుడ్ క్వీన్ కాజల్ అగర్వాల్ ని కూడా ఈ విలన్ క్యారక్టర్ కోసం సంప్రదించాడట. ఆమె చేయడానికి అంగీకరించింది. లుక్ టెస్ట్ కూడా జరిగిందట. కానీ ఎందుకో ఆ క్యారక్టర్ కి ఆమె సరిపడలేదని రాజమౌళి ఫీల్ అవ్వడం తో చివరికి ప్రియాంక చోప్రా ని సంప్రదించాడు. ఆమె వెంటనే అంగీకరించడం, హైదరాబాద్ కి వచ్చి లుక్ టెస్ట్ లో పాల్గొనడం వంటివి చేసింది. రాజమౌళి కి తెగ నచ్చేసింది. వెంటనే ఆమె పై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించాడు. ప్రియాంక చోప్రా ఇప్పటికే విలన్ క్యారెక్టర్స్ బాలీవుడ్ మరియు హాలీవుడ్ లలో చాలానే చేసింది. ఈ సినిమాలోని విలన్ పాత్రకు ఆమె మాత్రమే న్యాయం చేయగలదు అని రాజమౌళి బలంగా నమ్మడం తో ఆమెని తీసుకున్నారు.