https://oktelugu.com/

Ram Charan Daughter Name: ‘క్లిన్ క్లారా కొణిదెల’ అని తన కూతురుకి నామకరణం చేసిన రామ్ చరణ్.. ఈ పేరుకి అర్థం ఏమిటంటే!

బిడ్డ ముఖాన్ని ఇప్పటి వరకు మీడియా కి చూపించలేదు కానీ, బిడ్డని ఎత్తుకొని ఫోటోలు మాత్రం చాలానే దిగారు రామ్ చరణ్ మరియు ఉపాసన. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా ట్రెండింగ్ అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక నేడు రామ్ చరణ్ కూతురుని ఉయ్యాలలో వేసే కార్యక్రమం కుటుంబం తలపెట్టిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత చిరంజీవి రామ్ చరణ్ కూతురు పేరు ని స్వయంగా ట్విట్టర్ లో అధికారికంగా ప్రకటించాడు.

Written By:
  • Vicky
  • , Updated On : June 30, 2023 / 04:47 PM IST
    Follow us on

    Ram Charan Daughter Name: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు ఉపాసన కొణిదెల ఈమధ్యనే ఒక ఆడపిల్లకు తల్లితండ్రులైన సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ బిడ్డ పుట్టినప్పటి నుండి మెగా అభిమానుల్లో ఎంత ఆనందం ఉందో మాటల్లో చెప్పలేము. ఈ వార్త వచ్చిన రోజు నుండి నేటి వరకు సంబరాలు చేసుకుంటూనే ఉన్నారు.

    బిడ్డ ముఖాన్ని ఇప్పటి వరకు మీడియా కి చూపించలేదు కానీ, బిడ్డని ఎత్తుకొని ఫోటోలు మాత్రం చాలానే దిగారు రామ్ చరణ్ మరియు ఉపాసన. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా ట్రెండింగ్ అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక నేడు రామ్ చరణ్ కూతురుని ఉయ్యాలలో వేసే కార్యక్రమం కుటుంబం తలపెట్టిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత చిరంజీవి రామ్ చరణ్ కూతురు పేరు ని స్వయంగా ట్విట్టర్ లో అధికారికంగా ప్రకటించాడు.

    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ నా మనవరాలికి క్లిన్ కారా కొణిదెల అని నామకరణం చేసాము. ఈ పేరు ని లలిత సహస్రనామ శ్లోకం నుండి తీసుకున్నాము. క్లిన్ కారా అంటే ప్రకృతికి స్వరూపం అని అర్థం. అంతే అతీతమైన అమ్మవారి శక్తి అని కూడా ఈ పేరు లో ఉంటుంది. మా బిడ్డ ఎదిగే కొద్దీ ఈ లక్షణాలను కూడా పొందుతుంది అని అనుకుంటున్నాము’ అంటూ చిరంజీవి వేసిన ఒక ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. పేరు పలకడం కాస్త కష్టమే కానీ, రామ్ చరణ్ కూతురు కాబట్టి అభిమానులు నెమ్మదిగా అలవాటు చేసుకుంటారని అంటున్నారు. పాపని ఉయ్యాలలో వేస్తూ ఒక పక్క చిరంజీవి మరియు సురేఖ నిలబడగా, మరోపక్క ఉపాసన తల్లితండ్రులు నిలబడ్డారు. ఈ ఫోటో ని అభిమానులు ఇప్పుడు తెగ షేర్ చేసేస్తున్నారు.