Brahmanandam In Guntur Kaaram: లెజెండ్ బ్రహ్మానందం ప్రతి దర్శకుడి ఫేవరేట్ యాక్టర్. తమ రైటింగ్ ని, డైరెక్షన్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే నటన ఆయన సొంతం. అత్యంత సహజంగా ఉండే ఆయన నటన ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. అసలు బ్రహ్మానందం స్క్రీన్ పై కనిపిస్తే చాలు జనాలు నవ్వేస్తారు. వందల చిత్రాల విజయంలో ఆయన కీలక పాత్ర పోషించారు. కేవలం ఆయన కామెడీ కారణంగానే ఆడిన సినిమాలు కూడా ఉన్నాయి. టాప్ స్టార్స్ చిత్రాల్లో కూడా బ్రహ్మానందంకి స్క్రీన్ స్పేస్ తో కూడిన కామెడీ ఎపిసోడ్స్ ఉంటాయి.
మహేష్ బాబు చిత్రాల్లో అతడు, దూకుడు చాలా ప్రత్యేకం. కామెడీ అండ్ యాక్షన్ సమాన స్థాయిలో వర్క్ అవుట్ అయిన చిత్రాలు అవి. ఈ రెండు చిత్రాల్లో బ్రహ్మానందం కామెడీ అల్టిమేట్ అనాలి. ఈ మధ్య కాలంలో బ్రహ్మానందం చిత్రాలు తగ్గించేశారు. ఆయన సెలెక్టివ్ గా చిత్రాలు చేస్తున్నారు. అలాగే కామెడీ పక్కనపెట్టి సీరియస్ రోల్స్ చేస్తున్నారు. లేటెస్ట్ రిలీజ్ రంగమార్తాండ మూవీలో తన ఇమేజ్ భిన్నమైన ఎమోషనల్ రోల్ చేసి కన్నీరు పెట్టించారు.
అయితే గుంటూరు కారంలో మనం మునుపటి బ్రహ్మానందంని చూడబోతున్నామట. మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న గుంటూరు కారం చిత్రంలో బ్రహ్మానందం నటించాలని మహేష్ బాబు పట్టుబట్టారట. త్రివిక్రమ్ కి చెప్పి ఆయన కోసం కామెడీ ట్రాక్ రాయించాడట. బ్రహ్మానందం కూడా ఎస్ చెప్పిన నేపథ్యంలో మహేష్, బ్రహ్మీ కాంబో రిపీట్ అయ్యిందంటున్నారు. ఈ మేరకు టాలీవుడ్ లో ఓ వార్త హల్చల్ చేస్తుంది.
అలాగే త్రివిక్రమ్ దర్శకత్వంలో బ్రహ్మానందం నటించి చాలా కాలం అవుతుంది. ఇక గుంటూరు కారం 2024 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. పూజా హెగ్డే ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది. ఆమె స్థానంలో మీనాక్షి చౌదరిని తీసుకున్నారనే ప్రచారం జరుగుతుంది. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. గుంటూరు కారం ఫస్ట్ లుక్ ఫ్యాన్స్ ని అలరించింది.