Ram Charan-Kamal Haasan: మన సౌత్ ఇండియా లో ఇప్పుడు మల్టీస్టార్ర్ర్ సినిమాల హవా ఏ స్థాయిలో ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ప్రస్తుతం మల్టీస్టార్ర్ర్ సినిమాకి ఉన్న డిమాండ్ ఏ సినిమాకి లేదు అనొచ్చు..ఇటీవలే దర్శక ధీరుడు రాజమౌళి నేటి తరం మాస్ హీరోలు అయిన ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ ని హీరోలు గా పెట్టి తీసిన #RRR సినిమా ఏ స్థాయిలో విజయం సాధించిందో మన అందరికి తెలిసిందే..తెలుగు ,హిందీ మరియు తమిళ్ అని తేడా లేకుండా ప్రతి భాషలో ఈ సినిమా వసూళ్ల పరంగా సెన్సేషన్ సృష్టించి వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని అందుకుంది..ఇక ఆ తర్వాత చిరంజీవి – రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన మరో మల్టీస్టార్ర్ర్ ఆచార్య సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయి విజయం సాధించలేదు కానీ, ఇటీవలే విడుదల అయిన మరో క్రేజీ మల్టీస్టార్ర్ర్ విక్రమ్ సినిమా మాత్రం దుమ్ము లేపేసింది..కమల్ హాసన్ హీరో గా విజయ్ సేతుపతి మరియు ఫహద్ ఫాజిల్ వంటి టాప్ హీరోలు ముఖ్య పాత్రలో నటించిన ఈ సినిమా ఇప్పుడు సౌత్ ఇండియా లో అన్ని బాషలలో రికార్డు స్థాయి వసూళ్లను రాబడుతూ కమల్ హాసన్ కి బిగ్గెస్ట్ కంబ్యాక్ మూవీ గా నిలిచింది.

ఆ చిత్ర దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఇంగ్లీష్ మూవీస్ తరహా లో సరికొత్త యూనివర్స్ ని సృష్టిస్తున్నాడు..ఆయన గతం లో హీరో కార్తీ తో తీసిన ఖైదీ సినిమాని విక్రమ్ సినిమాతో లింక్ చేస్తూ చూపించిన ట్విస్ట్ కి ప్రతి ఒక్కరు థ్రిల్ కి గురి అయ్యారు..ఇక త్వరలో రాబొయ్యే ఖైదీ 2 కి విక్రమ్ సినిమాకి కూడా లింక్ ఉంటుంది అట..విక్రమ్ సినిమా క్లైమాక్స్ లో హీరో సూర్య ని రోలెక్స్ గా చూపించి పార్ట్ 2 లో ఆయన క్యారక్టర్ ఎలా ఉంటుందో ఒక్క చిన్న గ్లిమ్స్ ఇచ్చాడు లోకేష్ కనకరాజ్..అయితే లోకేష్ కనకరాజ్ తీసే యూనివర్స్ లో రామ్ చరణ్ కూడా యాడ్ అవ్వబోవునట్టు తెలుస్తుంది..విక్రమ్ సినిమాలో కమల్ హాసన్ కి కొడుకు ని చూపించే సంగతి మన అందరికి తెలిసిందే..ఆ కొడుకు పెరిగి పెద్ద అయిన తర్వాత రామ్ చరణ్ అవుతాడు అట..అంటే త్వరలోనే కమల్ హాసన్ మరియు రామ్ చరణ్ కాంబినేషన్ లో ఒక్క సినిమా చూడబోతున్నాము అన్నమాట..గతం లో లోకేష్ కనకరాజ్ ఒక్క ఇంటర్వ్యూ లో రామ్ చరణ్ తో ఒక్క సినిమా చేయబోతున్నాను అని తెలిపిన సంగతి మన అందరికి తెలిసిందే..ఆయన అనుకున్న ఆ ప్రాజెక్ట్ ఇదే అని సోషల్ మీడియా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన అంశం.

Also Read: Johnny Depp: మాజీ భార్యపై కేసు గెలిచిన స్టార్ హీరో.. హోటల్ లో పార్టీ.. రూ.49 లక్షల బిల్!
ఇప్పటికే రెండు మల్టీస్టార్ర్ర్ సినిమాలు చేసిన రామ్ చరణ్ ని , త్వరలో కమల్ హాసన్ లాంటి లెజండరీ హీరో తో చేస్తుండడం అభిమానులకు ఒక్క పండగ లాంటి వార్త అనే చెప్పొచ్చు..దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే బయటకి రానున్నాయి..ప్రస్తుతం ఆయన సౌత్ ఇండియన్ సెన్సషనల్ డైరెక్టర్ శంకర్ తో ఒక్క సినిమా చేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఇప్పటికే 40 శాతం కి పైగా షూటింగ్ ని కూడా పూర్తి చేసుకుంది ఈ సినిమా..ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో తన 50 వ సినిమాగా ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు..ఈ సినిమా తర్వాత జెర్సీ సినిమా దర్శకుడు గౌతమ్ తిన్నూరి తో ఒక్క సినిమా చెయ్యబోతున్నాడు రామ్ చరణ్..వీటి తర్వాత లోకేష్ కనకరాజ్ తో సినిమా చేసే అవకాశం ఉంది అని ఫిలిం నగర్ లో వినిపిస్తున్న టాక్..చూడాలి మరి బాక్స్ ఆఫీస్ వద్ద ఈ క్రేజీ మల్టీస్టార్ర్ర్ మూవీ #RRR అవుతుందా లేదా ఆచార్య లాగ మిగిలిపోతుందా అనేది.
Also Read: Rushi Raj YCP Strategist: పీకే పోయి.. రుషిరాజ్ వచ్చే.. వైసీపీకి కొత్త వ్యూహకర్త
Recommended Video:


[…] […]