Ram Charan And Sukumar: తన సినిమాలు చేయడంలో చాలా ఇంటెలిజెంట్ అని ప్రూవ్ చేసుకున్న దర్శకుడు సుకుమార్…ఆయన ప్రేక్షకుడికి అర్థమయ్యేలా కాదు, ప్రేక్షకులు అర్థం చేసుకునే విధంగా సినిమాలను చేస్తాడు. ఒకదానికి మించిన మరొక సక్సెస్ ని సాధించాలని డిఫరెంట్ కథలను రాసుకొని సినిమాలు చేస్తుంటాడు. ప్రతి సీన్లో ఏదో ఒక మైన్యూర్ డీటెయిల్ అయితే ఉంటుంది. అందుకే సినిమా చూసిన ప్రతిసారి మనకు ఆ సీన్స్ చాలా కొత్తగా కనిపిస్తూ ఉంటాయి. ఇక ఇప్పటివరకు స్టార్ హీరోలందరితో సినిమాలను చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న సుకుమార్ ఇప్పుడు మరోసారి రామ్ చరణ్ తో సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. గతంలో వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన ‘రంగస్థలం’ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సాధించిందో మనందరికి తెలిసిందే…ఇక ఇప్పుడు మరోసారి వీళ్ళ కాంబినేషన్లో రాబోతున్న సినిమా మీద మంచి అంచనాలైతే ఉన్నాయి. సుకుమార్ ఇప్పటికే పుష్ప, పుష్ప 2 సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధించాడు. వరుసగా మంచి విజయాలను అందుకుంటూ దూసుకుపోతున్న సుకుమార్ ఇప్పుడు రామ్ చరణ్ తో చేస్తున్న సినిమా విషయంలో చాలా కేర్ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. అందులో భాగంగానే రామ్ చరణ్ కి కొన్ని కండిషన్స్ అయితే పెడుతున్నారట.
తన బాడీ వెయిట్ తగ్గాలని సుకుమార్ చెప్పినట్టుగా తెలుస్తోంది. దానికి రామ్ చరణ్ మాత్రం నేను వెయిట్ తగ్గాలంటే జిమ్ మానేయాలి. నేను జిమ్ మానెయ్యలేను సార్ అంటూ ఫన్నీ గా సుకుమార్ కి చెబుతున్నాడట. దాంతో సుకుమార్ నేను ఒకప్పుడు చిట్టిబాబు ను ఎలా చూపించానో ఇప్పుడు అంతకు మించిన క్యారెక్టర్ లో నిన్ను చూపించాలనుకుంటున్నాను.
కాబట్టి నేను చెప్పింది నువ్వు చేయాల్సిందే అంటూ సుకుమార్ కరాకండి గా చెప్పడంతో రామ్ చరణ్ సుకుమార్ మీద కోపంతో ఉన్నాడనే వార్తలైతే వస్తున్నాయి. మొత్తానికైతే రామ్ చరణ్ సుకుమార్ చెప్పిన విషయాలకు కట్టుబడి ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే వీళ్ళ మధ్య అప్పుడప్పుడు చిన్న చిన్న విభేదాలు కూడా వస్తున్నాయనే వార్తలైతే వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా స్క్రిప్ట్ విషయంలో రామ్ చరణ్ అంత సాటిస్ఫైడ్ గా లేడని ఇంకా బెటర్మెంట్ చేస్తే బాగుంటుందని సుకుమార్ కి ఒక సలహా ఇచ్చారట. సుకుమార్ టీం దానికోసమే ఇప్పుడు తీవ్రమైన కసరత్తులు చేస్తున్నారు. మొత్తానికైతే సుకుమార్ కి రామ్ చరణ్ కి మధ్య చాలా మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి…. వీళ్ళ కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తుందో చూడాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…