DRDO: భారత రక్షణ పరిశోధన సంస్థ డీఆర్డీవో అభివృద్ధి చేసిన స్వదేశీ మిలిటరీ కాంబాట్ పారాచూట్ సిస్టమ్ (ఎంసీపీ) 32 వేల అడుగుల ఎత్తులో విజయవంతంగా ప్రయోగం చేయడం ద్వారా భారత సైనిక సాంకేతికతలో మైలురాయిగా నిలిచింది. ఈ పరీక్షను భారత వైమానిక దళానికి చెందిన ‘వింగ్ కమాండర్ విశాల్ లఖేష్’ మాస్టర్ వారంటు ఆఫీసర్లు ఆర్జే సింగ్, వివేక్ తివారి నిర్వహించారు. ఇది ప్రపంచంలో 25 వేల అడుగులకంటే పై ఎత్తులో సురక్షితంగా దూకి ల్యాండ్ అవగల ఏకైక స్థాయి పారాచూట్ వ్యవస్థగా నిలిచింది.
పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో..
ఈ సిస్టమ్‌ను డీఆర్డీఓకి చెందిన రెండు కీలక సంస్థలు ఏరియల్ డెలివరీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్, ఆగ్రా, డిఫెన్స్ బయో ఇంజినీరింగ్ – ఎలక్ట్రోమెడికల్ ల్యాబ్, బెంగళూరు సంయుక్తంగా రూపొందించాయి. ఇది పూర్తిగా భారతీయ పరిజ్ఞానంతో రూపొందించబడినది. ఎటువంటి విదేశీ టెక్నాలజీ ఆధారం లేదు. ఈ సిస్టమ్‌లో నావిక్ ఉపగ్రహ ప్రణాళికను సమన్వయం చేశారు. దీనివల్ల సిగ్నల్ జ్యామింగ్, ఎలక్ట్రానిక్ హ్యాకింగ్ లేదా విదేశీ జీపీఎస్ దెబ్బతీటలు అమాన్యమవుతాయి. రక్షణ నిపుణులు దీన్ని ‘‘భారత నావిగేషన్ స్వావలంబనకు చిహ్నం’’గా అభివర్ణిస్తున్నారు.
అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానం..
ఎంసీపీ ప్రణాళికలో పలు ఆధునిక సాంకేతిక లక్షణాలు ఉన్నాయి. నానోమెటీరియల్ రీన్‌ఫోర్స్‌డ్ లైన్లు, ఇవి బలమైనదే కాక ఆక్సిజన్ తక్కువ ఉన్న ఎత్తుల్లోనూ విశ్వసనీయంగా పనిచేస్తాయి. తక్కువ వేగంతో దిగడం, మెరుగైన స్టీరింగ్ నియంత్రణ, ప్రీ–సెట్ ల్యాండింగ్ జోన్ వ్యవస్థ. ఇవన్నీ కలిపి సైనికుడిని ముందే నిర్ణయించిన ప్రాంతానికి సురక్షితంగా తీసుకువెళ్తాయి.సైనికుడు 32 వేల అడుగుల ఎత్తులో ప్రయాణమయ్యే సమయంలో 90 సెకండ్ల ‘ఫ్రీ ఫాల్’లో సంతులనం కోల్పోకుండా ఉండేలా ఆక్సిజన్ సపోర్ట్ వ్యవస్థను ల్యాబ్‌లు సమన్వయించాయి.
యుద్ధ వ్యూహాలకు గేమ్ ఛేంజర్
ఈ పారాచూట్ సిస్టమ్ ప్రత్యేక బలగాలకూ, ఎయిర్‌బోర్న్ యూనిట్స్‌కూ అత్యాధునిక తాత్కాలిక యుద్ధ ప్రయోజనాలు అందిస్తుంది. అధిక ఎత్తులో దూకడం వల్ల సైన్యపు గుర్తింపు రాడార్‌లకు చిక్కకుండా దళాలు లక్ష్యానికి చేరుకుంటాయి. శత్రు రక్షణ వ్యవస్థలను సైలెంట్ ఇన్‌సర్షన్ ద్వారా దాటవచ్చు. అఫ్గానిస్థాన్ లేదా సియాచిన్ లాంటి హిమాలయాల సరిహద్దు ప్రాంతాల్లో ఈ సిస్టమ్ విపత్తుల సమయంలో ఉపయోగపడుతుంది.
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ విజయాన్ని అభినందిస్తూ దీన్ని
‘‘భారత స్వావలంబన దిశగా కీలక మైలురాయి’’గా పేర్కొన్నారు. ప్రత్యేక బలగాల శిక్షణకు, సరిహద్దు కార్యక్రమాలకు, విపత్తు సహాయ కార్యక్రమాలకు ఈ సాంకేతికత విస్తృత ప్రయోజనం అందిస్తుంది. ఎంపీసీఎస్ వ్యవస్థ ప్రపంచస్థాయి హై–ఆల్టిట్యూడ్ జంప్ టెక్నాలజీలో భారత్‌ను ముందుకు తీసుకొచ్చింది. విదేశీ ఆధారాన్ని తగ్గించి, స్వదేశీ సామర్థ్యంపై నమ్మకాన్ని పెంచింది. రాబోయే దశాబ్దంలో, ఈ సాంకేతికత సైనిక దళాల సమయస్పూర్తి, అప్రమత్తత, గోప్యతా ఆపరేషన్లలో ప్రధాన పాత్ర పోషించనుంది.