https://oktelugu.com/

Ram Charan: బాబాయ్ కోసం పిఠాపురానికి బయల్దేరిన అబ్బాయి… ఇక మామూలుగా ఉండదు…

పవన్ కళ్యాణ్ కి అండగా చాలామంది హీరోలు మద్దతు తెలుపుతున్నారు. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వాళ్ళ అమ్మ అయిన సురేఖను తీసుకొని పిఠాపురం వెళ్తున్నట్టుగా తెలుస్తుంది.

Written By:
  • Gopi
  • , Updated On : May 11, 2024 / 12:46 PM IST

    Ram Charan going to Pithapuram

    Follow us on

    Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాలో హీరోగానే కాకుండా బయట కూడా పలు రకాల సేవ కార్యక్రమాలను చేపడుతూ మానవత్వాన్ని చాటుకుంటూ ఉంటాడు. ఇక ప్రస్తుతం వాళ్ల బాబాయ్ అయిన పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యే గా పోటీ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక అందుకోసమే రామ్ చరణ్ పిఠాపురం బయలుదేరనున్నాడనే సమాచారం అయితే అందుతుంది. ఇక ఇప్పటికే పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం మొత్తం ప్రచారం తో హోరెత్తిస్తున్నాడు.

    ఇక ఇది ఇలా ఉంటే ఇప్పటికే పవన్ కళ్యాణ్ కి అండగా చాలామంది హీరోలు మద్దతు తెలుపుతున్నారు. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వాళ్ళ అమ్మ అయిన సురేఖను తీసుకొని పిఠాపురం వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక అక్కడే పవన్ కళ్యాణ్ ను కలిసి ‘కుక్కుటేశ్వర స్వామి’ దేవాలయంలో దర్శనం కూడా చేసుకొని రావాలని సురేఖ అనుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇక అందులో భాగంగానే సురేఖ తో పాటు రామ్ చరణ్ పిఠాపురం బయలుదేరినట్టుగా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే మరో రెండు రోజుల్లో ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో ఇప్పటికే పలు రకాల పార్టీలు వాళ్ళ పార్టీ తరపున ప్రచారాన్ని విస్తృతంగా చేపడుతున్నాయి.

    ఇక ఇదిలా ఉంటే ఈసారి అధికారం ఎవరు దక్కించుకుంటారు అనేదానిపైన సర్వత్ర ఆసక్తి అయితే నెలకొంది. అటు అధికార పార్టీ అయిన వైసిపి గానీ , ఇటు తెలుగు దేశం, జనసేన, బీజేపీ కూటమి సైతం అధికారం మాదే అంటూ ముందుకు సాగుతున్నాయి. మరి దీంట్లో జనాలు ఏ పార్టీకి మద్దతు ఇస్తారు అనేది తెలియాల్సి ఉంది. ఇక ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ మాత్రం ఈసారి పిఠాపురం నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది.

    ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే వైసిపి మరోసారి పవన్ కళ్యాణ్ ను భారీగా ఓడించాలనే ఉద్దేశ్యం తోనే అక్కడ ఆరుగురు మంత్రులను నియమించి వాళ్ళ చేత ప్రచారం కూడా చేయిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక మొత్తానికైతే ఈసారి ఎలక్షన్లు చాలా రసవత్తరంగా జరగబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఇందులో ఏ పార్టీ విజయం సాధిస్తుంది అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…