https://oktelugu.com/

HBD: ఈ బర్త్ డే బ్యూటీ ఐరన్ లెగ్ అనే ముద్ర నుంచి సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా ఎలా ఎదిగింది..?

అల్లు అర్జున్ హీరోగా వచ్చిన 'సన్నాఫ్ సత్యమూర్తి' సినిమాలో ఒక కీలక పాత్రలో నటించి మెప్పించింది. గత సంవత్సరం వచ్చిన "ది కేరళ స్టోరీ" సినిమాతో మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంది.

Written By:
  • Gopi
  • , Updated On : May 11, 2024 / 12:54 PM IST

    Interesting facts about Adah Sharma

    Follow us on

    HBD: తెలుగు సినిమా ఇండస్ట్రీలో హార్ట్ ఎటాక్ అనే సినిమా ద్వారా పరిచయమైన ఆదాశర్మ ఆ సినిమా అంత పెద్ద సక్సెస్ సాధించకపోవడంతో ఆమెకి కూడా పెద్దగా గుర్తింపు అయితే రాలేదు. అయితే ఈ సినిమాలో నటించినందుకు గాను ఆమె నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఇక ఆ తర్వాత కూడా పలు సినిమాల్లో నటించి మెప్పించింది.

    అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించి మెప్పించింది. గత సంవత్సరం వచ్చిన “ది కేరళ స్టోరీ” సినిమాతో మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంది. ఇంకా ఈ సినిమా ఇచ్చిన బూస్టప్ తో ఆమె వరుస సినిమాలకు సైన్ చేస్తూ ముందుకు సాగుతుంది.ఇక ఇదిలా ఉంటే ఈరోజు ఈ ముద్దుగుమ్మ బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియా మొత్తం ఆమె అభిమానులు ఆమెకు బర్త్ డే విషెష్ లను తెలియజేస్తూ ఆమెను ఆనందింప చేస్తున్నారు…

    ఇక ఇదిలా ఉంటే ఆమె 2008 వ సంవత్సరంలోనే 1920 అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. కానీ ఈ సినిమా ఆమెకు అనుకున్నంత గుర్తింపు ను తీసుకురాలేదు. ఇక దాంతో కన్నడలో పునీత్ రాజ్ కుమార్ తో కలిసి ‘రణ విక్రమ’ అని సినిమా చేశారు. ఈ సినిమా కూడా ఆమెకు అంతంత మాత్రమే గుర్తింపును తీసుకొచ్చింది. దాదాపు 16 సంవత్సరాల సినీ కెరియర్ లో ఆమె చాలా సినిమాలు చేసినప్పటికీ అందులో ఒకటి, రెండు సినిమాలను మినహాయిస్తే ఆమెకు గుర్తింపు తెచ్చిన సినిమాలు చాలా తక్కువనే చెప్పాలి. ఇక ఈ ముద్దుగుమ్మ నటన మీద ఉన్న ఇంట్రెస్ట్ తో చదువును సైతం పక్కనపెట్టి యాక్టింగ్ లో మెలకువలను నేర్చుకుంది. ఇక ఈమె మూడు సంవత్సరాల వయసులోనే నాట్యం నేర్చుకోవడం విశేషం..ఇక జిమ్నాస్టిక్స్ లో పూర్తి నైపుణ్యాన్ని సంపాదించుకుంది. అమెరికాలో వీటికి సంబంధించిన శిక్షణను కూడా తీసుకుంది.

    ఇక మొత్తానికైతే ఈమె తెలుగులో ‘హార్ట్ ఎటాక్’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’, ‘క్షణం ‘ లాంటి సక్సెస్ ఫుల్ సినిమాల్లో నటించింది. అయితే ఈ అమ్మడికి జంతువులంటే చాలా ఇష్టం.. అందువల్లే సామాన్య జనాలు డబ్బులను వెచ్చించి జంతువులను కొనుక్కోలేరు. కాబట్టి వీధిలో దొరికే వీధి కుక్కలను పెంచుకోవాలని తన అభిమానులకు సూచనలను ఇస్తుంది. ఇక మొత్తానికైతే ఈ అమ్మడు ప్రస్తుతం చాలా బిజీగా తన కెరీర్ ని కొనసాగిస్తుందనే చెప్పాలి…