HBD Upasana: మెగా కోడలు, కామినేని ఇంటి ఆడపడుచు ‘ఉపాసన’ పుట్టిన రోజు నేడు. ఉపాసన నేడు తన 33వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. టాలీవుడ్ సెలబ్రిటీలు, ఆమె సన్నిహితులు, బంధువులు ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అలాగే ఉపాసన ఫాలోవర్స్ ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడానికి పోటీ పడుతున్నారు. 1989లో జూలై 20న ఉన్నతమైన కుటుంబంలో పుట్టిన ఉపాసన, మొదటి నుంచి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఉపాసన.. తండ్రి అనిల్ కామినేని, తల్లి శోభనా కామినేని.

ప్రస్తుతం ఉపాసన అపోలో హెల్త్ కేర్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అదే విధంగా తనదైన శైలిలో సెలబ్రిటీల డైట్స్ గురించి ఇంటర్వ్యూలు చేస్తూ సామాన్యులకు హెల్త్ టిప్స్ చెబుతూ ముందుకెళ్లడం గొప్ప విషయం. ఉపాసన, ఎంత బిజీగా ఉన్నా.. నిత్యం హెల్త్ విషయంలో అనేక చిట్కాలను తెలుసుకుని ప్రజలకు తెలియజేయడం ఆమెకు ఉన్న అలవాటు. అన్నట్టు ఉపాసన హెల్త్ వరకే పరిమితం అవ్వలేదు.
Also Read: Thank You Movie First Review: నాగ చైతన్య ‘థాంక్యూ’ మూవీ మొట్టమొదటి రివ్యూ
చరణ్, చిరంజీవి సోషల్ మీడియాలోకి లేట్ గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, అప్పటివరకు వారి సినిమాల గురించి ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ ఇస్తూ.. మెగాభిమానులకు మెగా ఫ్యామిలీకి మధ్య వారధిలా నిలిస్తూ కోడలి పాత్రను కూడా సమర్థవంతంగా పోషించారు ఉపాసన. ఉపాసన గురించి ఎవరికీ తెలియని మరో విషయం ఏమిటంటే.. ఆమె భవిష్యత్తులో సినీ నిర్మాణంలోకి కూడా అడుగు పెట్టబోతున్నారు.

‘ఉపాసన’ పుట్టిన రోజు సందర్భంగా మెగా కుటుంబంలో ఈ రోజు రాత్రి ఘనంగా ఓ వేడుక జరగబోతుంది. మెగా బంధువులు సన్నిహితులు అందరూ ఈ వేడుకలో ఎన్టీఆర్, మహేష్ ఫ్యామిలీలు కూడా పాల్గొనబోతున్నారు. ఇక తన సతీమణికి చరణ్ స్పెషల్ బర్త్ డే గిఫ్ట్ ఇవ్వబోతున్నారట. ఇక పుట్టినరోజు సందర్భంగా ‘మా ఓకే తెలుగు’ తరపున ఉపాసనకు ప్రత్యేక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.
Also Read:Liger Trailer: విజయ్ దేవరకొండ ‘లైగర్’ ట్రైలర్ పై క్రేజీ అప్ డేట్.. ఫ్యాన్స్ కి ఫుల్ కిక్కే
Recommended Videos